
వెన్నెల కూడా వేడి సెగలైన వేళ
సెలయేటి గల గలలు వెదురు పొదలలో గాలి రాగాలు
మొగలి రేకుల మధుర వాసనలు
ఇంతలో ఆకాశం అంచున ఓ మెరుపు మెరిసింది
మేఘం కరిగింది చినుకు చినుకుగా నేల రాలింది
చిగురుటాకు సిగ్గుతో ఒదిగింది
ఓ చిరు మొగ్గ తొడిగింది
పరుగు పరుగున వచ్చే పైర గాలి
కొమ్మకొమ్మకూ కథలెన్నో చెప్పింది
ఈ మెగ్గ గుండెలో ఆశలెన్నొ రేపింది
మంచు ముత్యమై రాలిన వేళ
తూరుపున వెలుగులు నిండేటి వేళ
ఆ మొగ్గ విరిసింది వగలెన్నొ నేర్చింది
అందమంత నాదంది ఆకాశమే హద్దంది
గాలికే రాగాలు నేర్పింది ప్రకృతికే పరిమళాలు అద్దింది
ఈ గాలి రాగాలు విన్నాడో, పరిమళాలు కోరాడో
ఓ తేనె దొంగ రంగు రంగుల రెక్కలు పూని
గండు తుమ్మెద నేను నిండు పున్నమి నీవంటు
కవితలే చెప్పాడు కలలెన్నొ రేపాడు

కలలో ఏమేమి చూసిందొ ఆ చిన్ని పువ్వు
తానుగా వలచింది
మధువులే చిలికింది అమరుణ్ణి చేసింది
అమృతాన్ని పొందిన అమ్మరుణ్ణి నేనంటు
ఆకాశానికెగిరాడు ఆ పూల రంగడు
రెక్కలల్లార్చాడు మెరుపులా మెరిశాడు
క్రీ గంట చూశాడు
సిగ్గుల మొగ్గైన ఆ పూబాల
మళ్లీ వస్తాడు నారేడు నన్ను వీడి మనలేడు
అని మదిని తలచింది
రేయి గడిచింది పగలు గడిచింది
నాడు వెళ్ళినా ఆ తేనె దొంగ
మరలి రాలేదు
అతని రాకకై చూసి చూసి
వలపులన్ని వేదనల తలపులవగా
ఆశలన్ని అడియాశలవగా
వగచి వగచి ఆ చిన్ని పువ్వు
తీగ వీడింది.., నేల రాలింది...
చిత్రాలు , కవిత బాగున్నాయి .
రిప్లయితొలగించండిఅమాయకపు పూబాలలు తుమ్మెదని నమ్ముతూనే ఉంటాయి. కలకాలం మోసపోతూనే ఉంటాయి. ఈ "పుష్ప విలాపం" అంతేలేనిది. ఈ కవిత చదువుతుంటే ఎందరో అమాయకపు అమ్మాయిల జీవితాలే గుర్తుకొస్తున్నాయి. ఇదే జీవిత సత్యం అని చాలా బాగా చెప్పారు. బాగుంది కవిత.
రిప్లయితొలగించండికవిత చాలా హృద్యంగా ఉంది. ఆనందంగా చదువుతూ చదువుతూ చివరికొచ్చేసరికి తెలీకుండానే మనసు భారమైంది :( నాక్కూడా అమ్మాయిలే కనిపించారు పూబాలలో..
రిప్లయితొలగించండిబొమ్మలు చాలా బాగా సెలెక్ట్ చేసారు :)
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండికవిత చాలా బాగుందండి.
రిప్లయితొలగించండిఇలాంటి కథలు ఎన్ని తెలిసినా మళ్ళీ ప్రతి పూబాలకూ పూబోణికీ తన ఆశ కొత్తగానే ఉంటుంది, తనవాడు మంచివాడనే మత్తులోనే ఉంటుంది.
రిప్లయితొలగించండిఅలాగే మీ పదాలూ (తెలిసిన భావాలనే) కొత్త అద్దాల్లొ, కొత్త అర్థాల్లో పలకరిస్తున్నాయి.
బాగుంది అని చెప్పి ఊరుకోవాలనిపించక....
Wowwwww!Beautiful!
రిప్లయితొలగించండిపూబాలకు - స్త్రీకి, తుమ్మెదకు-పురుషుడికి చాలా దగ్గర పొలిక ఉంది. కానీ ఓ చిన్ని తేడా ఉంది. ఆ పూలకు, తుమ్మెదకు బుద్ధిని ఇవ్వలేదు. అది వాటికి సబబే.
రిప్లయితొలగించండికానీ మనకు ఆలోచనా శక్తిని కల్పించాడు భగవంతుడు. ఆశలు చెలరేగే వయసులొ కాస్త ఆలోచించ గలిగితే ఏ బాలకూ ఇటువంటి కష్టం రాదు. అలాగే పురుషులూ ఆలోచించి మసలుకో గలిగితే మనిషిగా మిగులుతారు.
మీ కవిత చదువుతూంటే నేనెపుడో రాసిన కవితలోని
రిప్లయితొలగించండికొన్ని లైన్లు గుర్తుకొస్తున్నాయి.
ఈ వనం లోని సుమాలపై
ఇంద్రధనుస్సు వలిగిపోయిందేమో
వగలుతో వూగిపోతున్నాయి
వలచేందుకు తుమ్మెదలు
భ్రమిస్తున్నాయి వేడుకగా...
కొన్ని కొత్త ప్రయోగాలు చేసారు.. ఈ సారి చాల సాదా సీదా పదాలు వాడినట్టునారు? కవిత కన్నా.. ఒక చక్కని కధ చదివానట్టనిపించింది నాకు..
రిప్లయితొలగించండిఈడేరి ఫలించిన కలలనూ
రిప్లయితొలగించండిఅవి పండి తడిమిన చిగుర్లనూ
మరో కవితకు దాచారా?
బాగుంది.
విశ్వప్రేమికుడు గారు మీరు చెప్పింది కరెక్టే. కాని "ఆశలు చెలరేగే వయసులో" చెలరేగటమే గాని, బుద్ధి పనిచేసే రోజులు పోయాయి. కాని మీరన్నట్లుగా ఆ వయసులో, ఇప్పుడు పెరిగిపోతున్న ఈ స్వాతంత్ర్యంలో, సమానత్వంలో, సక్రమంగా అలోచించగలిగితే ఇంక లేనిదేముంది. ఇన్ని కథలెందుకు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది తల్లితండ్రుల కట్టడిని తప్పుపడుతున్న వాళ్ళేగా.
రిప్లయితొలగించండివిశ్వ గారు ,
రిప్లయితొలగించండిచా....ల బాగా చెప్పేరు ,ఇంకా మొదటి చిత్రంలో నాకు ఇష్టమయినవి ఉన్నాయి .ముఖ్యంగా కలర్ ,ఫోటో చాల బాగుంది .
baagundi ...nice
రిప్లయితొలగించండిఏమిటి ఇన్ని రోజులుగా కనిపించటం లేదు? ఎక్కడికెళ్ళారబ్బా సోదరులు! పని వత్తిడివల్లనా లేక వివాహ వేడుకలా? ఇలా అడిగానని తప్పుగా అనుకోవద్దు.
రిప్లయితొలగించండిtvaralo vastanu. koddiga pani vattide, kaanee kalam kadalananta kaadu. :)
రిప్లయితొలగించండిmee andarikee cheppakumda chesukuntana pelli!? mottaaniki aa prayatnaalu jarugutunnnayi. :)
kavita bavundi
రిప్లయితొలగించండిsree raama navami subhaakankshalu .......
ధన్య వాదాలు. మీకు కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. :)
రిప్లయితొలగించండిఏమైపోయారండి విశ్వప్రేమికుడు గారు. కనిపించట్లేదు. బిజీనా.
రిప్లయితొలగించండి