About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

17, జనవరి 2010, ఆదివారం

ఓ పూబాలవెన్నెల కూడా వేడి సెగలైన వేళ
సెలయేటి గల గలలు వెదురు పొదలలో గాలి రాగాలు
మొగలి రేకుల మధుర వాసనలు

ఇంతలో ఆకాశం అంచున మెరుపు మెరిసింది
మేఘం కరిగింది చినుకు చినుకుగా నేల రాలింది
చిగురుటాకు సిగ్గుతో ఒదిగింది
చిరు మొగ్గ తొడిగింది

పరుగు పరుగున వచ్చే పైర గాలి
కొమ్మకొమ్మకూ కథలెన్నో చెప్పింది
మెగ్గ గుండెలో ఆశలెన్నొ రేపింది

మంచు ముత్యమై రాలిన వేళ
తూరుపున వెలుగులు నిండేటి వేళ
మొగ్గ విరిసింది వగలెన్నొ నేర్చింది

అందమంత నాదంది ఆకాశమే హద్దంది
గాలికే రాగాలు నేర్పింది ప్రకృతికే పరిమళాలు అద్దింది

గాలి రాగాలు విన్నాడో, పరిమళాలు కోరాడో
తేనె దొంగ రంగు రంగుల రెక్కలు పూని
గండు తుమ్మెద నేను నిండు పున్నమి నీవంటు
కవితలే చెప్పాడు కలలెన్నొ రేపాడు

కలలో ఏమేమి చూసిందొ చిన్ని పువ్వు
తానుగా వలచింది
మధువులే చిలికింది అమరుణ్ణి చేసింది

అమృతాన్ని పొందిన అమ్మరుణ్ణి నేనంటు
ఆకాశానికెగిరాడు పూల రంగడు
రెక్కలల్లార్చాడు మెరుపులా మెరిశాడు
క్రీ గంట చూశాడు

సిగ్గుల మొగ్గైన పూబాల
మళ్లీ వస్తాడు నారేడు నన్ను వీడి మనలేడు
అని మదిని తలచింది


రేయి గడిచింది పగలు గడిచింది
నాడు వెళ్ళినా తేనె దొంగ
మరలి రాలేదు

అతని రాకకై చూసి చూసి
వలపులన్ని వేదనల తలపులవగా
ఆశలన్ని అడియాశలవగా
వగచి వగచి చిన్ని పువ్వు
తీగ వీడింది.., నేల రాలింది...

20 వ్యాఖ్యలు:

 1. అమాయకపు పూబాలలు తుమ్మెదని నమ్ముతూనే ఉంటాయి. కలకాలం మోసపోతూనే ఉంటాయి. ఈ "పుష్ప విలాపం" అంతేలేనిది. ఈ కవిత చదువుతుంటే ఎందరో అమాయకపు అమ్మాయిల జీవితాలే గుర్తుకొస్తున్నాయి. ఇదే జీవిత సత్యం అని చాలా బాగా చెప్పారు. బాగుంది కవిత.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కవిత చాలా హృద్యంగా ఉంది. ఆనందంగా చదువుతూ చదువుతూ చివరికొచ్చేసరికి తెలీకుండానే మనసు భారమైంది :( నాక్కూడా అమ్మాయిలే కనిపించారు పూబాలలో..
  బొమ్మలు చాలా బాగా సెలెక్ట్ చేసారు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఇలాంటి కథలు ఎన్ని తెలిసినా మళ్ళీ ప్రతి పూబాలకూ పూబోణికీ తన ఆశ కొత్తగానే ఉంటుంది, తనవాడు మంచివాడనే మత్తులోనే ఉంటుంది.
  అలాగే మీ పదాలూ (తెలిసిన భావాలనే) కొత్త అద్దాల్లొ, కొత్త అర్థాల్లో పలకరిస్తున్నాయి.
  బాగుంది అని చెప్పి ఊరుకోవాలనిపించక....

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పూబాలకు - స్త్రీకి, తుమ్మెదకు-పురుషుడికి చాలా దగ్గర పొలిక ఉంది. కానీ ఓ చిన్ని తేడా ఉంది. ఆ పూలకు, తుమ్మెదకు బుద్ధిని ఇవ్వలేదు. అది వాటికి సబబే.

  కానీ మనకు ఆలోచనా శక్తిని కల్పించాడు భగవంతుడు. ఆశలు చెలరేగే వయసులొ కాస్త ఆలోచించ గలిగితే ఏ బాలకూ ఇటువంటి కష్టం రాదు. అలాగే పురుషులూ ఆలోచించి మసలుకో గలిగితే మనిషిగా మిగులుతారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీ కవిత చదువుతూంటే నేనెపుడో రాసిన కవితలోని
  కొన్ని లైన్లు గుర్తుకొస్తున్నాయి.

  ఈ వనం లోని సుమాలపై
  ఇంద్రధనుస్సు వలిగిపోయిందేమో
  వగలుతో వూగిపోతున్నాయి
  వలచేందుకు తుమ్మెదలు
  భ్రమిస్తున్నాయి వేడుకగా...

  ప్రత్యుత్తరంతొలగించు
 7. కొన్ని కొత్త ప్రయోగాలు చేసారు.. ఈ సారి చాల సాదా సీదా పదాలు వాడినట్టునారు? కవిత కన్నా.. ఒక చక్కని కధ చదివానట్టనిపించింది నాకు..

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఈడేరి ఫలించిన కలలనూ
  అవి పండి తడిమిన చిగుర్లనూ
  మరో కవితకు దాచారా?

  బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. విశ్వప్రేమికుడు గారు మీరు చెప్పింది కరెక్టే. కాని "ఆశలు చెలరేగే వయసులో" చెలరేగటమే గాని, బుద్ధి పనిచేసే రోజులు పోయాయి. కాని మీరన్నట్లుగా ఆ వయసులో, ఇప్పుడు పెరిగిపోతున్న ఈ స్వాతంత్ర్యంలో, సమానత్వంలో, సక్రమంగా అలోచించగలిగితే ఇంక లేనిదేముంది. ఇన్ని కథలెందుకు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది తల్లితండ్రుల కట్టడిని తప్పుపడుతున్న వాళ్ళేగా.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
  kathasv@gmail.com
  jeevani.sv@gmail.com

  మీ,

  జీవని.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. విశ్వ గారు ,
  చా....ల బాగా చెప్పేరు ,ఇంకా మొదటి చిత్రంలో నాకు ఇష్టమయినవి ఉన్నాయి .ముఖ్యంగా కలర్ ,ఫోటో చాల బాగుంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఏమిటి ఇన్ని రోజులుగా కనిపించటం లేదు? ఎక్కడికెళ్ళారబ్బా సోదరులు! పని వత్తిడివల్లనా లేక వివాహ వేడుకలా? ఇలా అడిగానని తప్పుగా అనుకోవద్దు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. tvaralo vastanu. koddiga pani vattide, kaanee kalam kadalananta kaadu. :)

  mee andarikee cheppakumda chesukuntana pelli!? mottaaniki aa prayatnaalu jarugutunnnayi. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ధన్య వాదాలు. మీకు కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఏమైపోయారండి విశ్వప్రేమికుడు గారు. కనిపించట్లేదు. బిజీనా.

  ప్రత్యుత్తరంతొలగించు