పేజీలు
About me
- విశ్వ ప్రేమికుడు
- నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...
1, సెప్టెంబర్ 2010, బుధవారం
నల్లనయ్య మా ఇంటికీ వచ్చాడు
కారు మబ్బులాగ కమ్మని కబురు లాగ
చల్లని చినుకు లాగ చెలి నగవు లాగ
నేడు నల్లనయ్య మా ఇంటికీ వచ్చాడు
మలయ మారుతమై వచ్చాడు
తెలియని మాయేదో చేశాడు
మెరిసే మెరుపై వచ్చాడు
కనికట్టు చేసి వెళ్లాడు..
చూసే చూపులో పలికే మాటలో...
నా ఉచ్ఛ్వాసలో నిచ్ఛ్వాసలో...
మదిలో మెదిలే ప్రతి ఊహలో...
అన్నిటా తానే అయి వెలుగొందాడు
రాతి హృదయము కదానాది
మరి ఆర్ద్రమేల ఆయెనో కదా..?
లీలా మానుష విగ్రహుని
ప్రేమకు పులకించుటే తెలుసును
అతని వేణు నాదాన ...
మది మరులు గొలుపుటే తెలియును
అతని ఎదుట నే పురుషుని కాదా
రాధలా ఇంత ఆరాట మేలనో?
ఏమో వెదురును వేణువు చేసి
మదిని మరపించినా...
కాళింది సరసులో కాలనాగు
పడగల పై నాట్యమాడినా...
ప్రాణులన్నిటిని పకృతిగ చేసి
పురుషోత్తముడు తానై ఏలినా...
అంతా అతని మాయే కదా..
వద్దు వద్దు అనుకుంటూనే ఉంటాను
ఈ క్రిష్ణుని ఆగడాలు ఇక చాలనుకుంటాను
చిన్న పిల్ల వాడిలా వస్తాడు
అల్లిబిల్లి మాటలేవొ చెప్తాడు
కమ్మని కలలా వస్తాడు
ఓపలేనంత విరహమిచ్చి వెళతాడు
అమ్మలోని అమాయకతలా...
ఆనంద అంబుధిలా ..
కదిలే కాలంలా...
ప్రవహించే నదిలా..
మాటి మాటికీ వస్తాడు మురిపాల తేలుస్తాడు
ప్రేమలో నను ముంచి వేస్తాడు...
అలాటి కృష్ణుడు నేడు మా ఇంటికీ వచ్చాడు
వర్షించే మేఘమై
కారు మేఘాలలో మెరిసే మెరుపై
నను నిలువునా తడిపే తలపై...
పుట్టిన రోజున ఎవరైనా అందరినీ విందుకు పిలవడం పరిపాటి. మరి మన నల్లయ్యేమో తానే అందరిళ్లకూ వస్తాడు. పాలు వెన్నలతో పాటు మన మనసులను దోచుకు వెళతాడు. అయినా తానంటే మనకు తీరని మక్కువ. చూసినకొద్దీ చూడాలనిపిస్తాడు. అతని ప్రేమను పొందిన కొద్దీ మరింత పొందాలని పిస్తుంది. అదే కృష్ణ మాయ.
అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీకు,మీ కుటుంబ సభ్యులకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిబహుశ: వెంట, మీ రాధమ్మను కూడా తీసుకొస్తాడనేమో మీ కంత పరవశం. ఈ దోబూచులాపి తొందరగా మీ చెలితో రమ్మనండి. మళ్ళీ వచ్చే పుట్టిన రోజుకి కలసి ఆహ్వానిస్తామని ఆశ పెట్టండి. మళ్ళీ వచ్చే ఏట...మీ ఇద్దరిని, పాలు, వెన్నలతో...నిలువెల్లా తడిపేసి మరీ పోతాడు. ఆ మళ్ళీ వచ్చే ఏడాది..మీ కమ్మని కల తీర్చిన ఆ నల్లనయ్య...మాటి మాటి కి వచ్చేలా మీ ఇద్దరూ కలిసి మురిపాలు తీర్చే దాకా వదలడు. మీ ఓపలేని విరహాన్ని తీర్చి మరీ పోతాడు. ఆ తర్వాత ఏడాది, ఆ లీలా మానుషున్ని, మీ సూత్రధారిని, బుజ్జి బుజ్జి అడుగులతో ఆహ్వానించటం మాత్రం మర్చి పోకండేం:) అంతేకదా!
రిప్లయితొలగించండిHi,
రిప్లయితొలగించండిVisit my blog gsystime.blogspot.com
Please read two topics in english
1 second everything knows (Jan-10)
2 How starts nature in universe (Feb 10)
Plz reply to me by comment.
Thanks,
Nagaraju
విశ్వ ప్రేమికుడు గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం
రిప్లయితొలగించండిహారం
I wish you a very happy new year.
రిప్లయితొలగించండిvisit my blog http://gsystime.blogspot.com It contains universal information.
రిప్లయితొలగించండిMy new book released in jan 2011.(naa bhaavanaalochana - telugu language)
కొత్త పుస్తకం 'నా భావనాలోచన' విడుదల
Thanks,nagaraju
contact : 9741005713
Hi,
రిప్లయితొలగించండికొత్త పుస్తకం 'నా భావనాలోచన' విడుదల
blog : https://gsystime.blogspot.com
It contains Universal knowledge and intents
Thanks,
Naaraju G
9741005713
విశ్వ ప్రేమికుడు గారు ,
రిప్లయితొలగించండిఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆహా! చాలా బాగుందండీ! చక్కని భావ వ్యక్తీకరణ!
రిప్లయితొలగించండి