
అందరూ కొత్త సంవత్సరం కోటి కలలతో ఉన్నారు. గత మంతా ఓ తీపి చేదుల మధుర ఙ్ఞాపకం. కానీ అదే మన భవిష్యత్తుకు చుక్కాని. గతించిన ఙ్ఞాపకాలలో రాబోయే కాలానికి నిచ్చెనలు వెతుక్కుని ముందుకు సాగిపోవడమే మన కర్తవ్యం. ఈ 2009 వ సంవత్సరం నేను బ్లాగును ప్రారంభించడం నిజంగా ఓ అద్భుతం. ఇది నాకు చక్కని ఆనందాన్ని, తృప్తిని ఇచ్చింది. చిన్నప్పటి నుండీ కథలూ, కాకరకాయలు చదివే నాకు నేను కూడా ఓ పెద్ద రచయితనయి పోవాలని కోరిక.అదీ మామూలుగా కాదు ఓ పెజీలకు పేజీలు రాయాలని తాపత్రయం. :):)
ఆశ ఉంటే సరిపోతుందా. దానిని అమలు పరచొద్దూ... అక్కడే చిక్కంతా. నా తాపత్రయానికి తగ్గట్టు రాసి ఉంటే ఎప్పుడో రవీంద్రనాథ్ ఠాగూరు, గురజాడ అప్పారావు మొదలైన మహా మహుల వరుసలో నాపేరు ( నేనే ) పెట్టేద్దును. రాసిన కగితాలు లెక్క గట్టి. :):) కానీ కలలున్నత తియ్యగా వాటి పనులుండవే.... అందుకే ఏదో అప్పుడప్పుడూ తోచింది రాసేవాడిని. కానీ అంత పేజీలకు పేజీలు రాయలేక, ఎవరైనా రాసే వాళ్లుంటే బాగుంటుంది అనిపించేది. రాసిన కాస్తా ఇంట్లో వాళ్లందరికీ చూపించి, చదివి( వాళ్లు చదివేంత సీన్ మన రచనలకు లెదని మనకి తెలుసు ) వాళ్లు వినేదాకా చంపేసే వాడిని. రాయాలన్న తాపత్రయం కంటే వీళ్లకు ఎప్పుడు వినిపిద్దామా అన్న తాపత్రయమే ఎక్కువగా ఉండేది. కానీ ఎంతకాలం పాత ప్రేక్షకులకే వినిపిస్తాం. పైగా మన ఇంట్లో వాళ్లు కాబట్టి ఏదో నన్ను ప్రోత్సహించడానికి బాగుంది అన్నా ( గోదావరీ సినిమాలో కమలినీ సుమంత్ ని రాజీని చూసినట్టు నన్ను చూడమని చిన్నటెస్ట్ పెడుతుందే.. ఆ చూపులో ప్రేమ ఎంత ఉందో పసిగట్టినట్టు )మనకి తెలిసిపోతుంది అందులో నిజాయితీ. అందుకే కొత్త ప్రేక్షకులుంటే బాగుండు, ఎప్పుడూ మనం రాసేది వీళ్లేగా చదివేది. కొత్త గా ఏంరాస్తాంలె అని బద్ధక మెసేది.
అలా అలా మన రచనా ఆసక్తి మందగిస్తున్న తరుణంలో మొదటి సారిగా నేను-లక్ష్మి గారి బ్లాగు గురించి (ఈ నాడు పేపర్ లో అనుకుంటా) చూసిన తరువాత, అలా బ్లాగులు తెలుగులో కూడా రాయచ్చని తెలిసిన తరువాత చాలా సంతోషమెసింది. పైగా ఆ బ్లాగులు చదివే వాళ్లు, దానికి వ్యాఖ్యలు చేసే వాళ్లు కూడా ఉంటారు. ఆహా ఇక ఆనందం ఆపుకోలేక నేనూ ఓ బ్లాగు రాయాలనిపించింది.
గత జనవరిలో ఉత్సాహంగా బ్లాగు మొదలు పెట్టాను. ప్రేమనే నా వస్తువుగా ఎంచుకున్నాను. అంటే ప్రేమికుల ప్రేమ కాదు విశ్వప్రేమ. ఇది చాలా బాగా నచ్చింది నాకు . ఈ ప్రేమని చొప్పించలేని విషయం లెదు. ఎ విషయాన్నైనా ప్రేమ అనే పాలలో మరిగించి వేడి వేడి పాయసం తయారు చేయడం చాలా బాగానచ్చేసింది. కానీ విశ్వ ప్రేమికుడు అనే పేరే కాస్త భారీగా అనిపించింది. ఏమైతే అయ్యింది, మొదట పేరు చూసి నవ్విన వాళ్లే నా బ్లాగు చూసి ఆనంద పడేలా నా జగమంత ప్రేమను రంగరించేసి ఓ ప్రపంచం చూపించేద్దామనుకున్నాను. ( ఈడికి మరీ ఆశలెక్కువే... ) అనుకోంగానే అయిపోతుందేటి ప్రేమ మీద టాపిక్కులు దొరకొద్దూ. ఆ దొరికిన వాటి మీద రాసే సత్తా ఉండొద్దూ... ? :):)
మొదట కవితలు, నా స్వగతం, అక్కడక్కడా కాస్త ఉద్రేకంతోనూ ఏవేవో రాశాను. పెద్ద పెద్దవి టైప్ చెయ్యాలంటే చాలా సేపు పట్టేది. ఈ లోపు రక రకాల బ్లాగులు చూశాను.అన్నీ చూసిన తరువాత,కంప్యూటర్ లో టైపాటులు పడలేక తేలికగా క్లుప్తంగా రాయవచ్చు కదా అని కపిత్వం మొదలు పెట్టాను. అసలు అంతవరకూ నాకు అనుభవం లెని విద్య అది. కథలైతే చదివాను కానీ కవితలెప్పుడూ చదవలేదు. ఏదో అప్పుడప్పుడూ ఏ పత్రికలోనో చదివేవాడిని అంతే. కానీ ఏదో నామనసుకు తొచిన భావాలను అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన తెలుగు పదాలతో రాద్దాములే అది కవిత్వమైనా కాకపోయినా కాస్త భావకుడన్ అనిపించుకుంటే ( నాచేత నేనే సుమా )చాలు అనుకుని ధైర్యంగా మెదలుపెట్టను. ఎలా రాసినా నాకు నచ్చితే చాలు అనుకున్నాను. అలాగే ఎవరి మనసూ నొచ్చుకోకుండా ఉండాలి. ఈ రెండూ ఖచ్చితంగా పాఠించాను.
ఏదైనా సాధన చేస్తేనే దానిలో మన లోతెంతో తెలిసేది.ఆ సాధనకు కొంత ప్రోత్సాహం కూడా ఇక్కడ మన బ్లాగులో లభిస్తుంది. కాస్త వ్యంగ్యం వ్యాక్యలు కూడా ఉంటాయి. ఇందులో మితిమీరిన ఘాటు వ్యాక్యలు, టపాలూ కూడా ఉంటాయి. ( నా వరకూ అంత అనుభవం రాలేదు లెండి ) మొన్నే జరిగిన ఓ బ్లాగు యుద్ధంలో నా స్నేహ బ్లాగరుకి వ్యతిరేకంగా ఓ కొత్త బ్లాగే సృష్టించబడి అక్కడ ఇష్టమొచ్చినట్టు రాశారు. మనసుకెందుకో చాలా బాధనిపించింది. ఇంత చెత్త బ్లాగులలో ఉండడం అవసరమా అనిపించింది. ( ఎదవ స్మశాన వైరాగ్యం. )అసలు నా బ్ల్లాగునే మూసేద్దామనే విరక్తి వచ్చింది. కానీ మళ్లీ నాలో విశ్వప్రేమికుడు మేల్కొన్నాడు. ( వీడికి పనీ పాడు ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు టింగ్ అని ప్రత్యక్షమైపోతాడు )
"ఏమోయ్ ఆ మాత్రానికే మనస్తాపం చెందితే మరి ముందు ముందు నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం బ్రతుకుతావ్? జీవితాన్ని ప్రేమించాలి. ఎత్తూ పల్లాలు వస్తుంటాయి పోతుంటాయి. నీ కలలు నెరవేరాలంటే వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగిపోతుండాలి కానీ ఇలా నీ పని పూర్తిగా ఆపేస్తావా? ఆయ్...! "
అంటూ ఓ చిన్న క్లాసు పీకే సరికి కొంత ఙ్ఞానోదయమైంది. అన్నీ మన మంచికె అన్నట్టు ఇవన్నీ కూడా నన్ను, నా చుట్టూ ఉన్నపరిస్థితుల్ని మరింత అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపకరించాయి.నాలో జీవితం పట్ల ప్రేమను మరింత పెంచాయి. నా కు మరింతప్రేరణ నిస్తూ ముందుకు నడిపించాయి.
ఎదేదో రాసి పడేశాను. ఇట్టే సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరంలో నా మీద నాకు కాస్త నమ్మకమొచ్చింది. ఇంకా చక్కగా రాయాలి అని అర్థమయ్యింది. ఇంకా విశ్వప్రేమికుడు పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ఇంకా ప్రేమికుల ప్రేమ నుండి వీడి మిగతా విషయాలపై ఎక్కువ టపాలు రావాలి. ఇప్పటికే అలాంటి ప్రయోగంలో కొంత ముందుకు సాగాను.అలాగే బ్లాగు ద్వారా ఎందరి నో పలకరించే అవకాశం, స్నేహం చేసే అవకాశం లభించింది. నాకూ కొంత స్నేహం లభించింది.
ఇలా ఈ సంవత్సర కాలంలో నా బ్లాగు ద్వారా చాలా మంచి జరిగింది. కనుక బ్లాగడం ఓ కళ. ఆ బ్లాగును ప్రేమించడం మరింత అందమైన కళ. కనుక I Love My Blog. మరి మీరు..?
అన్నట్టు మర్చి పోయానండోయ్. ఈ సంవత్సరం మీకు మరింత ఉత్సాహంగా గడవాలనీ, ప్రేమ మీజీవితంలో పొంగి పొర్లుతూ మీరు ఆనందంగా గడపాలనీ ఆశిస్తున్నాను. Happy New Year.
Thats the spirit. ప్రేమించండి...సాధించండి.
రిప్లయితొలగించండిమీ విశ్వప్రేమ బాగుంది .
రిప్లయితొలగించండినూతన సంవత్సర శుభాకాంక్షలు .
మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ స్వచ్చమైన భావాలు, విశ్వప్రేమతో కలకాలం విలసిల్లాలని కోరుకుంటున్నాను. All the best & Congrats.
రిప్లయితొలగించండిహృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిప్రేమించండి సాధించండి
రిప్లయితొలగించండిచాలా బాగా చెప్పారు మిత్రమా.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
శాంతి కుసుమాల పరిమళంతో
మనసు చిందించే చిరునవ్వుల వెలుగులలో
రెక్కలు తెగని అనురాగ పతంగులమై
ఎల్లలు లేని విశ్వాన
స్వేచా జీవులమై విహరింఛి
మన స్వప్న లోకాన్ని నిర్మించుకుందాం
Baagundi...
రిప్లయితొలగించండిబుడి బుడి నడకలు నడుస్తున్న మీలోని విశ్వప్రేమికుడు ఇంకా ఎంతో ఎదగాలని, విశ్వవ్యాప్తమవ్వాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో కోరుకుంటూ................
రిప్లయితొలగించండిబ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
రిప్లయితొలగించండిమనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ
ప్రేమ..................
రిప్లయితొలగించండిప్రేమ................
ప్రేమ...............
ప్రేమ.............
ప్రేమ...........
............
..........
........
......
....
..
.
c/o బృందావనంలో విశ్వప్రేమికుడు
నూతన సంవత్సర శుభాకంక్షలు
hello vishwa premikulu gaaru.... naa blog rangu marcha mani chepparu... kaani naaku telupu nalupu rangulante attachment ekkuvandi..... andhuke avi select chesukunnanu....
రిప్లయితొలగించండిమంచి స్ఫూర్తి. నూతన సంవత్సర శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిఅందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమహేష్ గారు: టెంప్లెట్ రంగు విషయంలో మీ మనసు నొప్పించి ఉంటే మన్నించండి.
ఉష గారు: అయ్యో మీ దాంట్లో కామెంటటం కుదరక ఇక్కడే రాస్తున్నాను.
నేనూ చాలా సార్లు వ్యాఖ్యలవసరమా అని ప్రశ్నించుకున్నాను. నాకు బాగుందంటూ రాసిన వ్యాఖలవసరం లేదనిపించింది. కానీ సద్వమర్శలతో కూడిన వ్యాఖ్యలు చాలా అవసరం. అవే నాలో ఆలోచన రగిలించేవి. నా రచనకు సాన పెట్టేవి. నాలోని నన్ను వెలికి తీసేవి అనిపించింది. నిజం చెప్పాలంటే ఈ సద్విమర్శలు చాలా తక్కువగా వస్తాయి మన బ్లాగులలో. బాగుంది, చాలా బాగుంది లాంటి వ్యాఖ్యలే ఎక్కువ. నూటికొక్కటి వచ్చే ఆ విమర్శనాత్మక వ్యాఖ్యలకోసమే మిగతావాటినీ స్వాగతించాలనిపిస్తుంది.
పూర్తిగా తీసి వేయడం కంటే కాస్త అదుపులొ ( అంటే వారానికి ఒక టపా పెడుతూ, ఆ వారంతంలోనే వచ్చిన వ్యఖలన్నీ ఆమోదించడం) చాలా మంచి పద్ధతని నా ఉద్దేశం.
ఈ నూతన సంవత్సరంలో మీ బుడిబుడి అడుగులు...వడివడి అడుగులు కావాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిసర్వే జనా సుఖినో భవంతు.
రిప్లయితొలగించండిఅందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు
జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….
తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ
mee manasantha vippi rasaru. baga rasaru. yedadi ayyindi rayadam modalu petti kabatti meeru anubhavagnule sumi.
రిప్లయితొలగించండిమీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక నూతన సంవతస్సర శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
రిప్లయితొలగించండిఅందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html