
ఇదిగో నే వచ్చేస్తున్నా
నాలో నిను కలిపేస్తున్నా
కమ్మని కలలే కంటావో
కల కాదు నిజమంటావో
నిన్నువీడి మనలేకున్నా
బిగి కౌగిట బంధిస్తున్నా
అంటూ...,
చెంతకు వచ్చేస్తుంది.
పోనీలే....!
ఇంతగా నను ఆరాధిస్తుంది
కాసింతైనా సేదతీరుస్తుంది
అనుకుని....
ప్రక్కకు ఇంత చోటిస్తాను
కనులలో ఆమెను నింపేస్తాను
అంత మాత్రానికే....!

ఆసాంత అల్లుకుపోతుంది
వింతైన ఆటలో అలపించేస్తుంది
మత్తులో గమ్మత్తు చేస్తుంది
చిత్తుగా నను ఓడించేస్తుంది
ప్రక్కన ఉంటూనే....
పెనుమాయ చేస్తుంది
మైమరచిపోతుంటాను
గాలిలో తేలిపోతుంటాను
మైకంలో ఏదేదో పలవరిస్తుంటాను
ఏమి వింత...!?
అమ్మ కొంగు చాటున నేనే
అతివ కౌగిట నేనే
పసివాడినీ నేనే
పరబ్రహ్మమునూ నేనే
ఆమెతో అమృతము సేవించితినేమో!?
అందుకే ఈ పరమానందము
అనుకుని
ఆమెను అక్కున చేరుస్తానా
ప్రేయసిగా ఆరాధిస్తానా
ఇక అంతే!
అందరూ ఒకటే నిందలు
ఏమిటి నే చేసిన నేరం?
నన్ను కోరి వచ్చినదని,
నా ప్రక్కన చోటిచ్చాను.
ఆమెను మనసారా ప్రేమించాను.
అంతేగా నేచేసినది.
మరి నన్నెందుకలా నిందిస్తారు?
మీరే చెప్పండి నే చేసిన తప్పేముంది?
ఇంతకీ ఏమంటున్నారనేకదా మీ ప్రశ్న. " నిద్రపోతు" అంటున్నారండీ! :(
అలా ఎందుకంటున్నారో వ్యాఖ్యలు చూడకుండా మీరు చెప్పగలరా?
:-)బాగుంది .
రిప్లయితొలగించండిఏమి బాగుందండీ? నన్ను అలా నిందిస్తుంటే మీరు బాగుందంటారా? ఇంతకీ మావాళ్లు నన్ను ఎందుకు నిందిస్తున్నారో చెప్పలేదు? :)
రిప్లయితొలగించండినిద్రాదేవి తో నెయ్యమా!బాగా బద్దకంగా నిద్రపోతూ నిరంతర స్వప్నాల్లో ....అందుకే పలవరింతలు :-)
రిప్లయితొలగించండిచివరిలో నిద్రపోతునని నిందించారని ఎందుకు చెప్పేసారండి.. పజిల్ లా ఉంచి అడగాల్సింది :) చాలా బాగా రాసారు
రిప్లయితొలగించండిఆ నిద్ర విషయం ఒకటీ మినహాయిస్తే మిగతాదంతా చలం ప్రేమలేఖల లెవెల్లో ఉంది.
రిప్లయితొలగించండిaనిద్రాప్రేయసి మీద ఎంత కవితలల్లారండీ !
రిప్లయితొలగించండినేను ఇంతే మీలగే....పాపం ఎప్పుడు పిలిస్తే అప్పుడు, పిలకపోయినా అప్పుడప్పుడూ నా చెంత చేరుతుంది కదా అని కళ్ళల్లో పెట్టుకుంటాను. దానికే మా వాళ్ళు నిద్రమొహం అంటూ ఉంటారు. పోనీలెండి నా మొహంలో నా ప్రేయసి ప్రతిబింబిస్తే అంతకన్నా కావలసినదేముంది :)
చిన్ని గారు : భలే చెప్పారండీ!
రిప్లయితొలగించండినేస్తం గారు : చిన్న క్లూ ఇవ్వక పోతే జనం నన్ను మరోలా అపార్థం చేసుకునే వీలుంది. అప్పటికే కొత్త పాళీ గారు చలం గారిని గుర్తుచేసుకున్నారు చూశారా? నకా మరీ అటువంటి ఇమేజ్ ఎందుకో నచ్చదు. :)
కొత్త పాళీ గారు : అవునా? మరీ అంత తీవ్రత ఉందా అందులో!? ధన్యవాదాలు. :)
సౌమ్య గారు : మీరు భలె వారే. న బిరుదులన్నీ మీరు కొట్టేస్తే నేనేమైపోవాలి? :)
Bahusa ... pagati kalalu kantunnaranemo ;) .. oorike.. :)
రిప్లయితొలగించండిBaaagundi... ayithe.. first half lo manchi raising undi mee raathalo.. inkentabba... ane feeling anna maata.. (Chadive vaallaku)
Siva Cheruvu
baganey oolaladutunnaru swapnalalo..:)
రిప్లయితొలగించండిచాలా బాగా వ్రాశర౦డి కవిత ఇలా౦టి కవితలు మరన్ని మీరు వ్రాయలని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండివిశ్వ ప్రేమికుడి మీద నింద లా అయ్యో పాపం చాలా దారుణం కదా :-)
రిప్లయితొలగించండిబాగా రాసారు మిత్రమా !