About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

7, మే 2010, శుక్రవారం

మనసుని జయించడం ఎలా? - 2 మనసుని ఎందుకు నిగ్రహించాలి?

మనసా తుళ్లి పడకే అతిగా ఆశపడకే అని ఎవరో రచయిత అద్భుతంగా రాసిన పాట పదె పదే గుర్తొస్తూ ఉంటుంది. పోయిన సారి మనసు ఎలా యుద్ధం చేస్తుందో చర్చించాం. మరి ఆ యుద్ధంలో గెలవడమెలాగ? అదే అంతు చిక్కని ప్రశ్న. చాలా మందిఎంతో గొప్ప వారుకూడా ఒక్కొ సందర్భంలో మనసుకు బానిసలవుతుంటారు. అంత గొప్ప గొప్ప వారే బానిసలవ్వక తప్పటం లేదే! మనం ఎందుకు మనసుని అదుపులో ఉంచుకోవాలి?

నిజమే భలే ప్రశ్న. మనసుని ఎందుకు అదుపులో ఉంచాలి? ఉంచకపొతే ఏమవుతుంది? ఎటువంటి వాటి విషయంలో మనసుని అదుపు చెయాలి? కొంత మందికి సిగరెట్టు నుండి బయట పడాలనుకుంటారు. మరికొంత మంది మరీ అతిగా టీ కాఫీలకు కూడా స్వస్తి చెప్పాలనుకుంటారు. ఇక్కడ మంచి,చెడు ఏమైనా ఉన్నాయా? ఏ అలవాటైనా మనసుపడితే దాన్ని నిగ్రహించుకోవలసిందేనా? సిగరెట్టు, మందు, జూదం లాంటి వి శరీరాన్ని ధనాన్ని గుల్ల చేసే దుర్వ్యసనాలు అంటే నిగ్రహించు కోవాలి సరే. మరి చదవడం, పాడడం, ఆటలు ఆడడం, రచనలు చేయడం లాంటి మంచి అలవాట్ల నుండి మనసును ఎందుకు ఆపాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తక మానవు.ఒక విషయం తప్పా ఒప్పా అన్నది ఆ విషయాన్ని ఆలోచించే వ్యక్తిని బట్టి,అతను ఉన్న పరిస్థితిని బట్టి ఉంటుంది. అది వదిలేద్దాం. ముందు మనసుని ఎందుకు నిగ్రహించాలి? ఇది మొదటి ప్రశ్న. దానిని అనుసరించి వచ్చింది ఎప్పుడు ( ఎటువంటి వాటి విషయంలో ) నిగ్రహించాలి? అనే రెండవ ప్రశ్న.


ఓ 25 ఏళ్ల వ్యక్తి ఉన్నాడనుకుందాం.
అతనికి అనుకోకుండా స్నేహితుల బలవంతం వల్లో, పరిస్థితుల ప్రభావమో మందు తాగడం అలవాటయింది అనుకుందాం.

అనుకున్నాం. ఏమయింది?

ఏమవుతుంది?కొంపలు మునిగి పొతాయ్! అసలే అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఇతనికి తాగుడు అలవాటుందని తెలిస్తే ఏ పిల్లైనా ముందుకు వస్తుందా? ఈ మధ్య ఆడపిల్లలు చాలా ఫాష్టు. ఆ అంతేగదా అని ఏ అమ్మయి అయినా ఒప్పేసుకున్నా ఒప్పుకోవచ్చు. కానీ ఆ అబ్బాయి తల్లి తండ్రులు ఎంత తల్లడిల్లి పోతారు? సరే అది పక్కన పెడదాం.

అతడు అసలు మనసుని ఎప్పుడూ నిగ్రహించుకుని ఎరగని వాడనుకోండి. ఎంత కష్టమో తెలుసా !? ఆ వ్యసనం రోజు రోజుకీ ఎక్కువయి పోతుంది. తాగి రోడ్డుమీద పడి దొర్లే స్థితిలో కొస్తుంది. ఎందుకంటే అతనికి నిగ్రహించుకోవడం తెలియదుకనుక. ఆ అవసరం లేదని అతని నమ్మకం కనుక.

ఆహా హా హా అలా ఎలా కుదురుతుంది? రోజుకు రెండు పెగ్గులే తాగి ఇంటికి వస్తాడు అని అంటారా?

అంటే అతను ఎంతో కొంత మనసుని అదుపులో పెట్టుకుని ఉన్నట్టే కదా? :)

కనుక మనం మనకు తెలియకుండానే కొంత వరకు మనసుని నిగ్రహిస్తున్నాం. కానీ అన్ని విషయాలలో కాదు. అదికూడా మనం ప్రయత్న పూర్వకంగా అనుకుని చేసే పనిలో కాదు. హమ్మయ్య ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. మన మనసు ఎప్పుడొ ఒకప్పుడు మన మాట వింటోంది. అయితే మరి మనం కావాలనుకున్నప్పడు చేయాలనుకున్న పని చేయగలిగే శక్తి మనకెలా వస్తుంది? అదే చిక్కు ప్రశ్న.

మిగతాది తరువతి టపాలో....

మరి మీరు కూడా ఏమైనా సలహా చెప్పి పుణ్యం కట్టుకోండీ! :)

6 వ్యాఖ్యలు:

 1. ఫోటో బావుంది. మీ టపాలూ ఆసక్తికరంగా వుంటున్నాయి. నా డైటింగ్ విషయంలో నా మనస్సుతో యుద్ధం చేస్తూ విజయం సాధిస్తుంటే ఎంతో తృప్తిగా వుంటోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అతిబలవంతమైనది ,అతివేగవంతమైనది ఐన మనస్సు అదుపూచేయాలని చూస్తే ఎదురుతిరిగి దాడిచేస్తుంది .అదెక్కడనుంచి పనిచెస్తున్నదో లేక ఎక్కడ దాని చర్యలు ప్రారంభమవుతున్నాయో పరిశీలించటం మొదలెడితే చాటున దాక్కున్న దొంగ జనం అలిిడికి బయటకు రాలేనట్లు దాక్కునే ఉంటుందనెది, పెద్దలుచెప్పే ఒకానొకపద్దతి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శరత్ గారు : మీ డైటింగ్ గురించి ఓ టపా సరదాగా రాసి మాతో పంచుకుంటే బాగుంటుంది. ధన్యవాదములు.

  దుర్గేశ్వర్ గారు : అవును మీరన్నది నిజం. మనసుపై ఆధిపత్యానికి ప్రయత్నించకూడదు. మంచి మాటలతో ప్రేమతో బుజ్జగించి మనమార్గానికి తెచ్చుకోవాలి. మీరిచ్చిన సలహా అద్భుతంగా ఉంది.కానీ అది యోగమార్గానికి సంబంధించింది. ఏ కొద్ది మందికో అది సాధ్యపడుతుందేమో. నమస్కారములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. గౌతమ బుద్దుడ్నో,మహావీరుడి మార్గాన్నో అనుసరిస్తే కచ్చితంగా మన మనస్సు అదుపులో వుంటుంది .ట్రై చేయండి :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అంటే అన్నీ వదిలేసి అరణ్యాలకు వెళ్లాలా? అది ఎంతమందికి సాధ్యం? ఇక్కడ ఉంటూనే మనసు మన మాట వినేటట్టు చేసుకోలేమా? అందుకే ఈ అన్వేషణ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. వారిద్దరి మార్గాన్ని అనుసరించాలంటే అడవులకేమి వెళ్ళనక్కర లేదండి ..సమాజం లో వుంటూనే వారి మార్గాన్ని అనుసరిస్తే మనసు జయించవచ్చు ..ఉదా ..బుద్దిస్ట్ అష్టాంగా మార్గ (eightfold path )
  1.Right vision
  2.Right action
  3.Right speech
  4Right aim
  5.Right livelihood
  6.Right effort
  7.Right awareness
  8.Right meditation
  చెప్పండి ఇప్పుడు అడవులకి వెళ్ళాలా?..:-)

  ప్రత్యుత్తరంతొలగించు