About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

27, మార్చి 2009, శుక్రవారం

ఈ నూతన తెలుగు సంవత్సరంలో...



కోయిల గొంతులోని తియ్యదనం
మావి చిగురులోని పచ్చదనం
వసంతపు సంధ్య లోని ఆహ్లాదం
ఆస్వాదిస్తూ మనసులు మురియాలి.

వేపపూత లోని సుగుణాలు
చెరకు తీపి వంటి ప్రేమలతో
ఆ మనసులు నిండాలి,
ప్రతి బ్రతుకూ పండాలి.

మన బ్లాగులు కమ్మని కవనాలతో
మది నమ్మిన భావాలతో
తెలుగు పూలు పరవాలి.
చదివిన ప్రతి హృదయంలో
ఆనందపు అమృతం కురియాలి.

బ్లాగు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
-విశ్వ ప్రేమికుడు

10 కామెంట్‌లు:

  1. మది నమ్మిన భావాలతో ....నడిచే ప్రతీ రోజూ ఉగాదే...

    ధన్య వాదాలు.. నూతన తెనుగు.. సంవత్సర శుభాకాంక్షలు..;)

    రిప్లయితొలగించండి
  2. మన బ్లాగులు కమ్మని కవనాలతో
    మది నమ్మిన భావాలతో
    తెలుగు పూలు పరవాలి.
    చదివిన ప్రతి హృదయంలో
    ఆనందపు అమృతం కురియాలి.

    paina cheppina.. line lu baagunnai friend ;-)

    రిప్లయితొలగించండి
  3. నూతన సంవత్సర శుభాకాంక్షలు
    బాగుంది :)

    రిప్లయితొలగించండి
  4. మీక్కూడా మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. చాలాబాగా రాసారు మీకూ మీ కుటుంభానికి ఉగాది శూభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  6. ఉగాది కవిత అద్భుతంగా రాశారు.మీకూ మీ కుటుంభానికి ఉగాది శూభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  7. మీ టపాలు వైవిధ్యభరితంగా ఉన్నాయి.
    అభినందనలు

    రిప్లయితొలగించండి