About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

16, ఫిబ్రవరి 2009, సోమవారం

నువ్వున్నది ఎక్కడ?


గతించిన జ్ఞాపకాల లోనే
మనసును సమాధి చేస్తావు
ఆ పూల పరిమళాలనే తలచుకుంటూ
ఈ వెండి వెన్నెలలో మల్లె తీగలను
చూచుట విస్మరిస్తావు
గతమెంతో మధురమంటావు
నాడు అనుభవించింది స్వర్గమంటావు
మరి ఇప్పుడు నువ్వున్నది ఎక్కడ?

ఆ గతించిన రోజులు తిరిగి రావాలనుకుంటావు
దానికై ఏదైనా సాధిస్తానంటావు
నీ కలల లోకం నిర్మిస్తానంటావు
మరి ఇపుడున్న స్థితినేమంటావు?
నువ్వున్నది ఎక్కడంటావు?

మనసును ప్రస్థుతానికి తీసుకువస్తే...
నీ చుట్టూ ఉన్నది అవలోకిస్తే...
స్నేహ పూదోట నుండి వీచే
ఈ గంధపు గాలులను ఆఘ్రాణిస్తే...
గమ్యం కోసం వేసే నీ ప్రతి అడుగునూ
ఓ మధురానుభూతిగా మిగిల్చే
ఈ క్షణాన్ని ఆస్వాదిస్తే...

తెలుస్తుంది
ఇంత అందం ఇది వరకు ఎన్నడూ ఎరగనిదని...
నువ్వున్నది స్వర్గంలోనేనని..

13 కామెంట్‌లు:

  1. 'గతించిన నిన్నటి గురించి ఆలొచించకు..
    రేపటి గురించి భయపడకు..
    నేటి కర్తవ్యాన్ని విస్మరించకు..'

    చాలా బాగా చెప్పారు ప్రెమికుడు గారు.
    ఆభినందనలు!

    రిప్లయితొలగించండి
  2. త్రిశంకు స్వర్గం కాదుకదా ? ఆలోచించండి .....(just kidding)
    కవిత చాలా చాలా బావుంది.thank you.

    రిప్లయితొలగించండి
  3. చాలా నచ్చింది...మీ కవిత!!!

    రిప్లయితొలగించండి
  4. అందరికీ ధన్యవాదాలు.
    @ పరిమళం గారు మీకు అలా అనిపించిందా..? ఏమో నండీ నేను నా పూర్వ స్నేహాన్ని తలుచుకుని అప్పుడప్పుడూ అబ్బ ఎంత మంచి రోజులవి. మళ్లీ ఆ స్నేహితుడితో అలా గడిపే రోజులు రావాలి అనుకుంటూ ఉంటాను. కానీ మొన్న కవిత రాసిన రోజు ఆలోచించాను. ఆప్పుడు స్నేహాన్ని ఎంతలా ఆనందించానో ఇప్పుడు అంతకంతే ఎక్కువ లభిస్తోంది. నిజానికి అప్పుడు ఒకేఒక్క స్నేహితుడు. కానీ ఇప్పుడు అతనితో పాటు మరో ఇద్దరు నాకు మంచి స్నేహాన్ని అందిస్తున్నారు. కానీ నేనే పూర్తిగా స్వీకరించటం లేదేమో అనిపించింది. వాళ్లని తలుచుకునే ఈ కవిత రాశాను.

    రిప్లయితొలగించండి
  5. ప్రేమికుడు గారు.
    మీ స్నెహం అజరామరముగా నిలవాలని కోరుకుంటున్నాను. :)

    రిప్లయితొలగించండి
  6. ప్రేమికుడు గారూ !క్షమించాలి ."నేను పదిలంగా అల్లుకున్నా " అనే పోస్ట్ లో టెక్నాలజీ మనకు దగ్గరవనపుడు మనుషులు ఇంకా ఎక్కువ అనుబంధంతో ఉండేవారని రాశాను .ఆ ఉద్దేశ్యం తోనే అప్పటి రోజులు బావుండేవేమో ....అనిపించి అలా కామెంట్ చేశాను అదీ సరదాగా ....అన్యదా భావించకండి .

    రిప్లయితొలగించండి
  7. ప్రేమికుడు గారూ !
    మహాశివరాత్రి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  8. ప్రేమికుడు గారూ !
    ప్రస్తుతంలో.. జీవించాలని.. మళ్లీ.. మరోసారి.. గుర్తుకు.. చేసారు... మహాశివరాత్రి శుభాకాంక్షలు ...

    రిప్లయితొలగించండి
  9. అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.
    @ పరిమళం గారు : అంత మాట లేన్డుకండి.. విమర్శలు నాకు సంతోషాన్ని ఇస్తాయి కానీ, బాధ పెట్టవు.

    రిప్లయితొలగించండి