About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

4, జూన్ 2010, శుక్రవారం

వేదం - సినిమా




కాస్త లేటుగా లేచానా? లేచిన దగ్గరనుండీ మనసు ఓ తెగ గోల పెడుతొంది. వేదం సినిమా... అని. అటు గమ్యం డైరెక్టర్ క్రిష్ ఓ లెవెల్లో ఊహలు. ఇటు అల్లు అర్జున్, మనోజ్ మంచు , అనుష్క ఇపరీతంగా నటించేశారంట... మన సాగక ఫ్రెండ్స్ అందరికీ ఫోను మీద ఫోనుకొడితే ఒక్కడూ ఖాళీ లేడు. ఇంకేం చేస్తాం..!? ఆగిపోతామేటి? నేనొక్కడినే వెళ్లాను. వెళ్లే టప్పటికి హౌస్ ఫుల్. గంట ముందే వెళ్లా. కానీ ఏంలాభం? ఈ రోజు నాలుగాటలూ ఫుల్లే. ప్రక్కనే బ్లాకు టిక్కెట్లోడు ఫార్టీ... యైటీ...ఫార్టీ... యైటీ... అంటు ఊరించాడు.

ఈ మనసు మా చెడ్డది. సినిమా చూడకపోతే చూడలేదని గోల. బ్లాకులో చూస్తే బ్లాకెందుకని గోల, పైరసీ చూస్తే తప్పు చేస్తున్నావని గోల. చూసినా గోలే. చూడక పోయినా గోలే. ఏంచేసినా గోలే!? ఈ గోల తట్టుకోలేకే ఈ మధ్య బ్లాకు బందు చేశా! సరేలే ఇంకా గంట టైముంది కదా దగ్గరలో ఉన్న వేరే థియేటర్ కి వెల్దామని బయలుదేరి వెళ్లి పోయా! కానీ అక్కడ ఈ సినిమా ఆడటం లేదు. ఏంచేస్తాం ఇంటిముఖం పట్టా! దారిలోనే వేదం సినిమా థియేటర్. మళ్లీ క్రిష్... అనుష్క... వీళ్లందరూ గిర్రున తిరిగారు. ఓ ప్రక్కన బ్లాకు వద్దు ఇంటికి వెళ్లిపొమ్మని గోల. ఎహే... నీ గొలాపు! అని ఓ సారి విదిలించుకుని ఆవేశంగా వెళ్లి ఓ టిక్కెట్టు కొనేశా.

అప్పటికే సినిమా మొదలైపోయింది. రాక్ స్టార్ గా నటించిన మనోజ్ బాబు రాకింగ్ అక్కడ. సగం నుంచి చూడడంతో నా బుర్రకెక్కలే ఆ పాటేంటో! మనోజ్ అప్పుడే ఎదుగుతున్న ఓ రాక్ స్టార్ ( ఇంగ్లీషోళ్ల నగరపు ఈ దుల్లో గిటారట్టుకుని ఒళ్లు ఓ తెగ ఇరిచేసుకుంటూ పాటలు పాడుతుంటారే ఆళ్లన్నమాట ). అతనికి ఓ షో చెయ్యడానికి హైదరాబాదులో మంచి అవకాశం రావడంతో అక్కడికి బయలుదేరుతాడు.

రాజు (అల్లూ అర్జున్) ఓ కేబుల్ ఆపరేటర్ దగ్గర పనిచేస్తుంటాడు. జూబ్లీ హిల్స్ స్లమ్ లో నివసించే అతనికి అదే జూబ్లీ హిల్స్ లో నివసించే రిచ్ గాల్ ఫ్రెండు ఉంటుంది. ఆమె దగ్గర బిల్డప్ కోసం తనను ఓ కోటీస్వరుడిగా పరిచయం చేసుకుని, డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతుంటాడు. జనవరి 1st పార్టీకి ఓ స్టార్ హోటల్ ఎంట్రీ టికెట్ తీసుకుంటానని గాల్ ఫ్రెండ్ కి మాటిచ్చిన రాజు ఆ టికెట్స్ కు డబ్బులకోసం నానా కష్టాలూ పడుతుంటాడు.

సరోజ ( అనుష్క ) అమలా పురంలో ఓ వేశ్యా వాటికలో పనిచేస్తుంటుంది. స్వతంత్రం గా తానే ఓ కంపెనీ నడపాలనుకుని హైదరాబాదుకు పారిపోయి వస్తుంది.

అలాగే ఓ చేనేత కుటుంబం, హైదరా బాదులో ఉండే ఓ ముస్లిం కుటుంబం ఈ సినిమాలో ప్రధానంగా కనిపిస్తాయి. ఈ అయిదుగురు హైదరాబాదులో ఎలా కలుసుకున్నారు? అక్కడ వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అనేవి తెరమీద మీరు తెలుసుకో వలసిందే. అయిదుగిరి కథలను సీన్ బై సీన్ చూపిస్తూ ఆసక్తిగా తెరకెక్కించారు క్రిష్.

వేశ్యావాటికలో వేశ్యలు పాడిన ఓ చిన్న పాటలాంటి తత్వాలు బాగున్నాయి. ఓ సీన్ లో అనుష్కా "నీదగ్గర పడుకుంటానయ్యా! దాన్ని బతికించు" అంటూ డాక్టర్ ని వేడుకుంటుంది. నటించడానికి ఆ ఒక్క సీన్ చాలేమో అనుష్కాకి. కానీ అందుకోలేక పోయిందనిపించింది. నటనా పరంగా చూస్తే ఇంకాస్త మెరుగ్గా చేయవలసింది అనిపిస్తుంది ప్రతీ పాత్రా కూడా. కానీ కథ నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. ఆసాంతం ఆసక్తి కరంగా సాగుతుంది.

కథలో పాత్రలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతుంటాయి. బ్రతుకు చుట్టూ పెనవేసుకున్న ఎన్నో వెతలు, అవి చెప్పే కొన్ని కథలు సినిమా ఫక్కీ లో రసవత్తరంగా తీశారు. గమ్యం అంచనాలతో ఈ సినిమాకూడా చూడచ్చు. క్రిష్ లిస్ట్ లో మరో హిట్ వేశేసుకోవచ్చు. మీరూ చూడండి. బాగుంటుంది.

కథలో ఓ రధాన పాత్ర నన్ను ఆలో చింపచేసింది. మనం ఎదగ వలసింది మనిషిగా అని మరో సారి నిరూపించింది. మళ్లీ నా మనసు ఆలోచనల లోతుల్లో పడిపోయింది. అది చెప్తున్న వినకుండా బ్లాకులో వెళ్లా కదా!? ఈ సారి వెళ్ల కుండా మీ అందరిముందూ ఓ గట్టి నిర్ణయం తీసేసుకుంటున్నాను. " ఇక ఓ సంవత్సరం పాటు బ్లాకులో సినిమా చూడకూడదు. " నా ముందు టపా "మనసుని జయించడం ఎలా? " చదివారుకదా? నెల రోజులు, 2 నెలలూ టెస్ట్ పాసైపోయామన్నమాట. అందుకే ఓ సంవత్సరం అంటున్నాను. :)

సినిమా చూసి ఏడ్చేటోళ్లు కూడా ఉన్నారేటి? అందునా మొగ వాళ్లలో నేనొక్కడినే ఉంటానేమో అనుకున్నా! నాకీ రోజు మరొకడెవరో కళ్లుతుడుచుకుని బయటకు వస్తూ కనిపించాడు. నాన్నా బాబూ చిట్టీ.... టివ్ టివ్ టివ్ మ్...... :)

6 కామెంట్‌లు:

  1. అయితే సినిమా బాగుందన్న మాట! ఇలా అయితే నేనెన్ని ఖర్చీఫులు రెడీగా పెట్టుకుని ఈ సినిమా చూడాలో ;-). అసలింతకీ చూసే అవకాశం నాకెప్పుడొస్తుందో! :-(

    రిప్లయితొలగించండి
  2. నన్నెవ్వరూ ఈ సినిమాకి తీసుకెళ్ళలేదు.. ;( బాబూ చిట్టీ టివ్ టివ్ టివ్...

    రిప్లయితొలగించండి
  3. గమ్యం సినిమా చూసినప్పుడు నేను టివ్ టివ్ టివ్ అని ఏడవలేదు కాని సినిమా హాల్ నుంచి బయటకి వచ్చాక ఒక పావుగంట సేపు ఆ ఆలోచనల నుంచి బయటకి రాలేకపోయాను. ఆ గాలి శీను నా ఫ్రెండ్ అయినట్టు, మా ఫ్రెండ్ చనిపోయినంత ఫీలింగ్ వచ్చేసింది. అంతగా లీనమైపోయాను ఆ సినిమాలో. అసలు వేదం సినిమా గురించి విన్నప్పటి నుంచే చూడాలని తెగ ఉవ్విళ్ళూరుతున్నాను . కాని ఇప్పుడు నేను ఇండియా లో లేను. ఎప్పుడు చూస్తానో ఏంటో. మనకేమో పైరసీ అంటే మహా చెడ్డ చిరాకు.

    రిప్లయితొలగించండి
  4. :( దాదారు 20 సంవత్సరాల తర్వాత ఒక సినిమా చుస్తుంటే కన్నీళ్ళు వచ్చాయి.
    అంతకు ముందు నాకు 5 యేళ్ళప్పుడు ఏదో శారద సినిమా చూసి కన్నీళ్ళు వచ్చాయి .

    తేడా ఎంటంటే చిన్నప్పుడు శారద గారి సినిమా చూసిన తర్వాత మళ్ళి శారద ఉండే ఏ సినిమాలు చుసే వాడిని కాదు.మళ్ళి ఎక్కడ శారద నన్ను ఏడిపిస్తుందో అని భయం.కానీ వేదం మాత్రం మళ్ళి చూడాలని డిసైడ్ ఐపోయా థియేటర్ నుంచి బయతకు రాగానే

    రిప్లయితొలగించండి
  5. @ మధుర వాణి గారు: అంటే అంత ఏడుపించే సినిమా కాదు కానీ..., కొన్ని సీన్ లలో నాకు ఆటోమేటిక్ గా కళ్లు చెమర్చేస్తాయి. మీకు సినిమా చూసే అవకాశం ప్రాప్తి రస్తు.

    @శివ గారు: అయ్యో..! ఎవరో ఒకరు ఉంటారు లెండి. లేక పోతే మీరే తీసుకెళ్లండి. అప్పుడు వాళ్లు చూసినా మళ్లీ చూడడానికి రెడీ అవుతారు.:):) నాకు లాగా ఒంటరిగా కాక మీకో తోడు దొరుకుంతుంది. :)

    @సాయి గారు : మొత్తానికి గాలి సీను టచ్ చేసాడు మిమ్మల్ని. మీరింకా మీ ఫ్రేండ్ గా తలచుకుని బాధ పడ్డారు, మా స్నేహితుడైతే ఏకంగా తననే ఊహించేసుకున్నాడు. :) ఎక్కువ అంచనాలతో వెళ్లకండి. పరమ చెత్త సినిమా అని ఓ 100 సార్లు అనుకుని బయలుదేరండి. అప్పుడు నచ్చుతుంది.
    @ వెంకట్ గారు: నేనూ మా స్నేహితులతో కలిసి మరో సారి వెళ్లాలనుకుంటున్నాను. మీరు నా పార్టీ నే అన్నమాట. బాబూ చిట్టీ టివ్ టివ్ టివ్ మ్... :)

    రిప్లయితొలగించండి