About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

5, జూన్ 2010, శనివారం

నువు గుర్తుకు వచ్చినప్పుడల్లాఉప్పెనై వస్తావు ఊహలకేమీ మిగల్చక ఊడ్చుకెళతావు
అంతటా నీవే ఆవహిస్తావు ఆసాంతం ఆక్రమిస్తావు
గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెను గాయపరచి వెళుతుంటావు

అయినా నా పిచ్చి గానీ...
నీవు లేనిదెప్పుడనీ నా ఊహల్లో!?
వెలుపల వెలుగై కనిపించేదీ నువ్వే
అంతరాన ఆరని మంటైనదీ నువ్వే!

అంతగా ఆక్రమించావు నన్ను

అయినా అమాయకంగా అనుకుంటాను...
నిన్ను నా గుండె గదిలో బంధించేశానని...
ఇక బయటకు రాలేవని...
నా ఊహలకు అడ్డు రావని...

ఈ కుల మతాల కుట్రకు బలియై పోయాను
చుట్టూ ఉన్న ప్రపంచానికి భయపడి
పిరికి వాడిలా మిగిలిపోయాను నీదృష్టిలో...

పిచ్చి వాడినే కదా మరి..!?
నీ ప్రేమను అందుకో లేక పోయిన కుల పిచ్చివాడిని

అయినా ఏ మంత్రం వేశావో తెలియదు
నా మది తలపుల తలుపులు ఛేదించుకు వచ్చినప్పుడల్లా
నీ ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
ఉవ్వెత్తున ఎగసే అలలై కల్లోలం సృష్టిస్తాయి

లోకం దృష్టిలో నిన్ను కాదనుకున్నా
నా వరకు నెటికీ నీతోనే ఉంటున్నా
బహుశా అందుకేనెమో!?
ఎవ్వరికీ అందంకుండా నాలోనేనే ఒంటరిగా మిగిలిపోతున్నా

కులం గొప్పదా? ప్రేమ గొప్పదా? అన్న చిన్న ఆలోచనవచ్చి అది ఆవేశమై ఏదో రాశేశా...

13 వ్యాఖ్యలు:

 1. మంచి స్టొరీ చెప్పారు... ఆక్రమించేసారు.. ఫస్ట్ లైన్ నించీ ప్రతీ లైనూ బాగుంది.. ఈ ప్రేమికునికి ఎన్ని.. ప్రేమ కధలున్నాయో.. ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. sunnitha bhavalatho chala bagarasaru..:)

  mari na drushtilo premaey goppadi.. meeremantaru?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అందరికీ ధన్యవాదాలు.

  @ శివ చెరువు : ప్రతి ఒక్కరి కథలోనూ నాకు ఓ ప్రేమ కథ కనపడుతుంది. :)
  @ సాహితి, మాధవ్ గారు : మొన్న ఇదే నా స్నేహితుడు ఒకరితో చర్చిస్తుంటే.. అతను "ప్రతి వ్యక్తికీ రెండు ధర్మాలుంటాయి. అవి వ్యక్తి గత ధర్మం, కుటుంబ ధర్మం. వ్యక్తిగతంగా ప్రేమ గొప్పదైతే, కుటుంబ పరంగా కులం గొప్పది" అని అన్నాడు.

  ఇది విన్న తరువాత ఈ కవిత మరొక్కసారి చదివితే ఈ కవితలోని ( నాలోని ) ప్రేమికుడు ఈ రెండు ధర్మాలనూ కాదనలేక అలా ఒంటరిగా మిగిలిపోయాడేమో అనిపించింది. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కేక అన్నయ్యా? నా బ్లాగు లో ఓ కొత్త పొస్ట్ ఉంది చూడు ఎలా ఉందో చెప్పు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చలా బాగు౦ది... :)

  "ప్రతి వ్యక్తికీ రెండు ధర్మాలుంటాయి. అవి వ్యక్తి గత ధర్మం, కుటుంబ ధర్మం. వ్యక్తిగతంగా ప్రేమ గొప్పదైతే, కుటుంబ పరంగా కులం గొప్పది"

  నిజమే.. కానీ, కుల౦ ఎలాపుట్టినదో.. తెలుసుకున్నారా?

  :) - నా దృష్దిలో " మానవ ధర్మ౦ " అనేది ఒకటి వున్నదని నా నమ్మక౦.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మానస గారు : నేనేమీ కులాన్ని సమర్థించడం లేదండీ. కానీ నా కవితలోని ప్రేమికుడు కులాన్ని కాదనలేకపోయాడు అని చెప్పాను అంతే!

  మనం పెంచి పోషించ వలసింది కులాన్ని - మతాన్ని కాదు, ధర్మాన్ని - సత్యాన్ని. అటువంటి సత్యాన్ని ధర్మాన్ని కాపాడేందుకు మనం ఏర్పరచుకున్న వ్యవస్థలే ఈ కుల మతాలు అని నమ్ముతాను నేను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీ కవితలోని ప్రేమికుడు మాత్రమే కాదు.. ఈ సమాజంలో కులాన్ని కాదనలేని ప్రేమికులు చాలామంది వున్నారు. :)
  (ఆ భాధితుల జాబితాలో నా పేరు కుడా వుంటుంది.)

  నా అభిప్రాయం కుడా... "మనం ఏర్పరచుకున్న వ్యవస్థ" అనే.. :) కానీ... అసలు ధర్మం, సత్యం అనేవే ఇపుడు లేకుండా పొయాయేమో!
  మారుతున్న కాలంలో ... మరుగుపడిన "గతః" - ఎవరికి అవసరం అండీ?

  వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థగా మార్చిందెవరో!
  ఈ విభేదాలు స్రుష్టించిందెవరో!
  కాలం, కులం చేతిలో చితినెక్కిన సమిధులం... ఓ సామాన్య జీవులం.
  (ఈ విషయంలో నేనో ఆజ్ఞానిని, క్షమించండి.)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. కవితా బావుంది ...సాహితి , మాధవ్ గార్లకు మీరిచ్చిన వివరణ బావుంది .

  ప్రత్యుత్తరంతొలగించు