About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

29, అక్టోబర్ 2009, గురువారం

కొత్త బ్లాగరుల కోసం... మీ బ్లాగు వ్యాఖ్యలలో పదనిర్ధారణ తొలగిచడమెలా?

ఒక్కో చుక్కా కలిస్తేనే నది అవుతుంది. మీ చేతులు కలిస్తేనే ఇది సంపూర్ణమౌతుంది.

అనుకో కుండా అక్కడక్కడా కొత్త బ్లాగు మితృలకు ఇచ్చిన సలహాలను ఈ కొత్త బ్లాగరులకోసం లో ప్రచురిస్తున్నాను. నాకేదో చాలా తెలుసని కాదు. తెలిసినంత వరకు చెబితే కొత్త వారికి ఉపయోగిస్తుందని. ఈ విషయంలో మీకింకా ఏమైనా తెలిస్తే వ్యాఖ్యలలో రాయండి. అలాగే నేను అక్కడక్కడా వాడిన ఆంగ్ల పదాలకు తెలుగు అనువాదాలు తెలుపండి.అవి సవరిస్తాను.

బ్లాగు వ్యాఖ్యలలో పదనిర్ధారణ తొలగిచడమెలా?



మీ
పోస్టులకు వ్యాఖ్య రాసినపుడు కొన్ని ఆంగ్ల అక్షరాలను నిర్ధారణ కోసం రాయమని అడుగుతుంది. దానినే పదనిర్ధారణ లేదా వర్డ్ వెరిఫికేషన్ అంటారు.

అది వ్యాఖ్యలు రాసే వారికి కాస్త విసుగొచ్చే విషయం. ఎందుకంటే తప్పుగా టైపు చేసినా, టైపు చెయ్యడనికి కాస్త ఎక్క్కువ టైం తీసుకున్నా మళ్లీ ఇంకో పద నిర్ధారణ అడుగుతుంది. దాని అవసరం అంత లేదని నా ఉద్దేశం.

ఒక వేళ అది మీరు తొలగించాలి అనుకుంటే మీ " డాష్ బోర్డు " కు వెళ్లి మీ బ్లాగు ---- సెట్టింగులు ---- నొక్కండి. అక్కడ మీకు వరుసగా ప్రాధమిక, ప్రచురణ, ఆకృతీ కరణ, వ్యాఖ్యలు....... మొదలైన ఆప్షన్స్ వస్తాయి.

అందులో " వ్యాఖ్యలు " అనే చోట నొక్కండి. అప్పుడు వ్యాఖ్యలకు సంబంధించిన సెట్టింగులు వస్తాయి. అందులో క్రిందినుండి 3 ఆప్షన్ " పదనిర్ధారణ చూపాలా వద్దా " అని అడుగుతుంది. మీరు " వద్దు " నొక్కండి. తరువాత క్రింద గానీ పైనగానీ ఉన్న " సెట్టింగులను సేవ్ " చెయ్యి నొక్కాలి. అంతే.... ఇక మీ బ్లాగును చూసుకోండి. వ్యాఖ్యలు రాసిన తరువాత పదనిర్ధారణ అడుగదు. :)

ఆడవాళ్లు చాలా మంది ఇతరులు రాసిన వ్యాఖ్యలను ముందుగా తాముచూసిన తరువాతే అవి ప్రచురిస్తారు. ఎందుకంటే కొంతమంది ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా రాసేవారూ ఉంటారు మన బ్లాగరులలో... కనుక అటువంటి సెట్టింగులు చేసుకుంటారు. మీరుకూడా అలా చేయాలంటే అదే పుటలో ( పేజీలో ) క్రిందినుండి 4 ఆప్షన్ చూడండి.

ధన్యవాదాలు :)

6 కామెంట్‌లు: