About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

31, అక్టోబర్ 2009, శనివారం

మీ టపాలకు కామెంట్ సెక్షన్ తొలగించాలి అనుకుంటున్నారా..?

మీరు మీ బ్లాగులో వ్యాఖ్యలు రాయడానికి ఎవరినీ అనుమతించ కూడదు అనుకుంటున్నారా..?
అయితే మీ డాష్ బోర్డ్ నుండి సెట్టింగులుకి వెళ్లండి. అక్కడ వరుసగా ప్రాథమిక, రచురన ,ఆకృతీ కరణ, వ్యాఖ్యలు ... అని ఉంటాయి. ఆ వ్యాఖ్యలు అనే చోట నొక్కండి. మళ్లీ వ్యాఖ్యలు > చూపించు / దాచ్పెట్టు అని వస్తుంది. దాచిపెట్టును సెలెచ్ట్ చేసుకుని ఆ పేజి క్రిందకు వచ్చి సెట్టింగులు సేవ్ చెయ్యి నొక్కండి. అంతే మీ బ్లాగులో వ్యాఖ్యలు కనపడవు.

మీరు
పోష్టులను సవరించులోకి వెళ్లి, మీరు వ్యాఖ్యలను తొలగించాలి అనుకుంటున్న టపా మీద నొక్కండి. అప్పుడు పోష్ట్ ఎడిటర్ వస్తుంది.

ఆ ఎడిటింగ్ బాక్స్ లో ఎడమచేతి వైపు క్రిందన పోష్ట్ ఎంపికలు అని ఉంటుంది. అది నొక్కితే- దానికి సరిగ్గా క్రిందన రీడర్ వ్యాఖ్యలు - అనుమతించు / అనుమతించ వద్దు అని ఉంటుంది. మీకు కావలసిన దానిని ఎంపిక చేసుకోండి.

తరువాత మళ్లీ ఓ సారి పోష్ట్ ఎంపికలు పై క్లిక్ చేయండి. తరువాత పోష్ట్ ను ప్రచురించండి. మీ బ్లాగులో చూసుకోండి. ఆ టపాకు వ్యాఖ్యలు రాయడానికి ఎవరికీ వీలు పడదు. మళ్లీ మీరు అనుమతించే వరకు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి