About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

18, అక్టోబర్ 2009, ఆదివారం

గతించిన వన్నీ పునరాగతమౌతున్నవి


అరుణుడు అస్తమించేది
వెన్నెల వెలుగును చూపడానికే.....

కడలి ఆవిరైనది తిరిగి
చిరుజల్లై కురవటానికే....

రాలే ఆకులు చెబుతున్నవి
వసంతమై మరలి వస్తామని....

పరుగిడు కాలం తెలుపుతున్నది
మరచిన మానవత్వాన్ని మరల ఆశ్రయిస్తావని....

ఇవి అన్నీ అస్తమయంతో ఆగిపోవు
నవ నవోన్మేషమై ఉదయించే వరకూ ఊరుకోవు ...

గతించిన వన్నీ పునరాగతమౌతున్నవి

పడిన చోటే ఆపకు నీపరుగు
లేచి నడిచావంటే ఉండరు నీసాటి ఇంకెవరూ

అని మరోమారు మనకు తెలుపుతున్నవి .

" తొలి అడుగు " బ్లాగు మిత్రుడు కార్తిక్ గారు రాసిన విశ్వ జనుడా మేలుకో అనే కవిత ద్వారా ప్రేరణ పొంది రాసినది ఈ కవిత.

11 కామెంట్‌లు:

  1. 'పడిన చోటే ఆపకు నీపరుగు
    లేచి నడిచావంటే ఉండరు నీసాటి ఇంకెవరూ'
    ఎంతమంచి ప్రబోధమో! ఇంతటి ప్రోత్సాహం ఉంటే అసలెవరూ పడకుండానే జీవిత సముద్రాన్ని అతి సులభంగా దాటేస్తారు. ఎంతో బాగుంది. చాలా మంచి భావాలు.

    రిప్లయితొలగించండి
  2. మీ మూలంగా మరో మంచి బ్లాగు పరిచయమైంది. మీ ప్రతిస్పందనగా వెలువడిన ఈ కవిత బాగుంది.

    "ఇవి అన్నీ అస్తమయంతో ఆగిపోవు
    నవ నవోన్మేషమై ఉదయించే వరకూ ఊరుకోవు ."

    ఇటువంటి పాజిటివ్ దృక్పథం వుంటే చాలు. దేన్నైనా సాధ్యం చేయొచ్చు.

    రిప్లయితొలగించండి
  3. బాగుందంది. చాల రోజుల తర్వాత మంచి టపాతో మామ్మల్ని అలరించారు.. :)

    రిప్లయితొలగించండి
  4. బావుందండీ కవిత ఉత్తేజపూర్వకంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  5. బాగా రాస్తున్నారు. ఆశా దృక్పధంతో రాసే రచనలే సమాజానికి ఉపయోగపడేది. డిప్రెషన్ లో ఉన్నవారికి ఊరట నిచ్చే కవిత ఇది.

    రిప్లయితొలగించండి
  6. బాగుంది.. జీవితాన వసంతాగమనం కాదెప్పటీకి అంతం అనే ఆలోచన బాగుంటుంది కదా. ఇంకొక్క సారి ఆ భావాన్ని కలిగించిన మీ కవిత ఇంకా బాగుంది. :-)

    రిప్లయితొలగించండి
  7. "పడిన చోటే ఆపకు నీపరుగు
    లేచి నడిచావంటే ఉండరు నీసాటి ఇంకెవరూ"

    ఈ వాక్యం చాల బాగుందండి
    బాగా రాసారు .....

    ఇంకెప్పుడు క్షమించండి అనకూడదు సరేనా ????????

    రిప్లయితొలగించండి
  8. ఇంతకంటే ఆప్టిమిస్టిక్ గా వేరెవరికీ సాధ్యం కాదేమో..
    చాలా బాగుంది.ప్రతి లైను ఒక సందేసమే.చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  9. ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.

    రిప్లయితొలగించండి