About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

1, సెప్టెంబర్ 2009, మంగళవారం

నా కవితలు మరొకరు కాపీ కొట్టే లెవెల్ కి ఎదిగాయోచ్....

( గమనిక : నా కవితలే కాదు సదరు బ్లాగులో వేరే వారి కవితలు కూడా కాపీ కొట్టడమైనది. నాకు సరిగ్గా తెలియదు అవి ఎవరివో... కానీ నేను ఎక్కడో చదివాను కవితలు . సారి మీ కవితలేమైనా కాపీ కొట్ట బడ్డాయేమో చూసుకోండి .మొత్తానికి నా కవితలైతే ఉన్నవి ఉన్నట్టుగా కాపీ, పేస్టు చేశాడు బ్లాగర్. )


ఏమిటీ మీ కవితను కాపీ కొట్టారా...?

కాపీ కొట్టారా..? ఏమిటండీ...?
కొట్టడమూ... పబ్లిగ్గా జల్లెడలో పెట్టడమూ.... దానికి నేను కామెంట్ వెయ్యడమూ కూడా జరిగాయి. ఆసందర్భంగానే నా ఆనందం. ఇంతకీ నా కాపీ కొట్టబడిన కవిత పేరు కూడా ఆనందమే నండోయ్.


నా కవితని కాపీ కొట్టారంటే మనకీ, మన కవితకీ లెవెల్ ఉందన్న మాటే కదా...? మంటారు? ఇంతకీ మీరు నా కవిత చదివారా? చదవక పోతే...


నా బ్లాగులో నా కవిత చదవడానికి ఇక్కడ నొక్కండి.


మరి సదరు మై డ్రీమ్స్ (నా కలలు) బ్లాగులో నా కవితను అతని కలగా చదవడానికి ఇక్కడ నొక్కండి.

పనిలో పని మీ కవితలూ, కథలూ వగైరా కూడా ఏమైనా కాపీ లెవల్ కి ఎదిగాఎమో కూడా లుక్కేసుకోండి.

ఇప్పుడే చూసుకున్నా నా మరో కవిత " నా కోరికలు " కూడా కాపీ కొట్ట బడిందోచ్.... :-) ఎంత క్రేజు నా కవితలంటే ( నా డ్రీమ్స్ ) బ్లాగర్ కీ...? :)

అందులో ఉన్న మిగత కవితలుకూడా ఖచ్చితంగా అతనివి కాదండోయ్.....

ఇంకెందుకాలస్యం చుపెయ్యండి ... :)

16 వ్యాఖ్యలు:

 1. మరి! అంత బాగా రాస్తే కాపీ కొట్టరేంటీ???..:):)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Meru chala baga Rastharu andi..nachina kavithalanu collect chestharu kadha kondharu...ala me kavithalu nachina vallu copy kodutharu...

  Me kavithalu anni chadhivanu.. Chala bagunnayee.......

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "పెదవి దాటని పదాలన్నీ" బ్లాగరు ఇలాగే నాకవిత తన బ్లాగులో ప్రచురించుకుంటే తెలుగు బ్లాగుల గుంపుకు తెలియచేయటం వారు ఆ బ్లాగర్ని ప్రశ్నించడం , ఆ తర్వాత ఆ కవితను తన బ్లాగు నుండి తొలగించడం జరిగింది .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. nenu blog lokaniki kotta,meeru kothavarini encourage chesthunnaru.
  meeru chala bbaga rasthunnaru.
  annatlu, me kavithalu kapi kottevallani kuda meru encourage chesthunnaru ante methe yentha goppa manasandi......

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @ పద్మార్పిత గారు : మీరు మరీ అంతపొగిడేస్తుంటే.....

  అయ్ బాబోయ్ చిగ్గేత్తోందండీ........ :):)

  @ అనఘ గారు : మీరు పొగుడుతున్నారా తిడుతున్నారా.... :) జస్ట్ కిడ్డింగ్ :)

  అంత భారీ పొగడ్తలు నేను జీర్ణించుకోలేనండీ......

  వద్దు .. నేను సామాన్య ప్రేమికుడిని.

  ప్రతీ మనిషిలోనూ మంచి ఉంటుందని నమ్మే ప్రేమికుడిని. అంతే.......... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. విశ్వ ప్రేమికుడు అంటే విశ్వాన్ని ప్రేమించే వాడు అని అనుకున్నానండి
  కానీ మీ కవితలు చదివాక తెలిసింది
  విశ్వాన్ని ప్రేమించే వాడు మాత్రమే కాదు
  ఆ అనుభవాన్ని బ్లాగు లో పొందుపరచి
  అక్షర అమృతంలో కలిపి విశ్వాని కంతటికీ ప్రేమను పంచేవాడు అని.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @ కార్తీక్ గారు : ప్రేమద్వారా వ్యక్తపరచలేనిది లేదని బలంగానమ్ముతాను నేను. మీ కవిత చదివాను చాలా బాగుంది. మీ అభిమానానికి కృతఙుడను మిత్రమా.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మన కవితకు అంతటి craze వచ్చింది అని సంతోషిద్దామా..? లేక మన కవిత వారి కవిత గా చెలామని అవుతున్నందుకు ఆలోచిద్దామా..?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మీ టపాల్లోని బొమ్మలు అద్భుతంగా వున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. సరదాకన్నాను. బొమ్మలు నచ్చినందుకు ధన్యవాదాలు. అన్నీ గూగుల్ వెతుకులాటలో దొరికినవే... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ha ha ha. ataniki mee kavitalu google search lo doriki vuntay :))
  (just kidding)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఆహా సరదాగా ఓ చురక వేశారండీ... ఇది ఆలో చించ వలసిన విషయమే..

  కానీ ఇక్కడి ( ఇక్కడే కాదు చాలా బ్లాగులలోని ) బొమ్మలు నావి ( వారివి ) కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఆ నాకలలు ( my dreams ) బ్లాగరు గారు ఇతరుల కవితలను తన కవితలు గా రాసుకోవడం కొంత స్వార్థ పూరితంగానూ, అమాయకత్వంగానూ అనిపించింది.

  ఇవి నేను రాసినవి కాదు. నాకు నచ్చినవి అని ఓ చిన్న వివరణ ఇచ్చి ఉంటే చక్కగా ఉండేది.

  ప్రత్యుత్తరంతొలగించు