About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

18, జులై 2009, శనివారం

ప్రకృతీ పురుషుల అనురాగ సంగమ వేళ...



వానలో తడిచిన ప్రతీసారీ
ఆనందంతో ముద్దయ్యే నా మనసుని
చూసి నాకో సందేహం వస్తుంది.
"నాన్ను గాక నా మనసును తడిపే శక్తి
ఈ వాన నీటికి ఎక్కడిదీ...?" అని.

అందుకు సమాధానం ఇలా అనిపిస్తుంది...


ప్రకృతి విరహ గీతికిలకు
పురుషుడు నిలువెల్లా కరిగి
ప్రేమ చినికులై ప్రకృతి
తనువంతా తడిపేస్తాడు
ఆమె అణువణువునూ శృతి చేస్తాడు...

అతని వలపు స్పర్శతో
పులకించిన పుడమి
శ్రీ గంధపు పరిమళాలను వెలువరిస్తుంది
ఆ ప్రేమ ధారలను
అనురాగంతో ఆలింగనం చేసుకుంటుంది
ఆత్మలోన ఇముడ్చుకుంటుంది...

ఈ ప్రకృతీ పురుషుల
అనురాగ సంగమ వేళ
ప్రకృతీలో అణువు లాంటి నేనూ
అతని ప్రేమలో తడిచాను...
పరవశించాను...

10 కామెంట్‌లు:

  1. "నాన్ను గాక నా మనసును తడిపే శక్తి
    ఈ వాన నీటికి ఎక్కడిదీ...?" అని.
    చాలాచాలా బాగుంది.బాగా రాసారండీ.

    రిప్లయితొలగించండి
  2. అసలెంత అద్భుతంగా ఉందో మీ వర్ణన !
    "ప్రకృతి విరహ గీతికిలకు
    పురుషుడు నిలువెల్లా కరిగి
    ప్రేమ చినికులై ప్రకృతి
    తనువంతా తడిపేస్తాడు"
    ఎంత అందమైన భావన !

    రిప్లయితొలగించండి
  3. అందరికీ ధన్యవాదాలండీ.. :)

    ఆత్రేయగారూ నా బ్లాగులోకి స్వాగతం... సుస్వాగతం... :)

    రిప్లయితొలగించండి
  4. "నాన్ను గాక నా మనసును తడిపే శక్తి
    ఈ వాన నీటికి ఎక్కడిదీ...?" అని.
    చాలాచాలా బాగుంది.బాగా రాసారండీ.
    Hats off to you

    రిప్లయితొలగించండి
  5. నా బ్లాగుకొచ్చి ఈ లింక్ ఇచ్చి ఒక అందమైన కవితని చదివే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
    ఏ మాటకామాటే చెప్పాలి. మీరు రాసింది చాలా చాలా నచ్చేసింది నాకు :)
    నేను రాసినదానికి మీరిచ్చిన వివరణ కూడా సబబుగానే తోస్తోంది.
    మీ బ్లాగులో నేను చదవాల్సిన పోస్టులు చాలానే ఉన్నట్టనిపిస్తోంది. మళ్ళీ వస్తాను :)

    రిప్లయితొలగించండి