వానలో తడిచిన ప్రతీసారీ
ఆనందంతో ముద్దయ్యే నా మనసుని
చూసి నాకో సందేహం వస్తుంది.
"నాన్ను గాక నా మనసును తడిపే శక్తి
ఈ వాన నీటికి ఎక్కడిదీ...?" అని.
ఆనందంతో ముద్దయ్యే నా మనసుని
చూసి నాకో సందేహం వస్తుంది.
"నాన్ను గాక నా మనసును తడిపే శక్తి
ఈ వాన నీటికి ఎక్కడిదీ...?" అని.
అందుకు సమాధానం ఇలా అనిపిస్తుంది...
ప్రకృతి విరహ గీతికిలకు
పురుషుడు నిలువెల్లా కరిగి
ప్రేమ చినికులై ప్రకృతి
తనువంతా తడిపేస్తాడు
ఆమె అణువణువునూ శృతి చేస్తాడు...
అతని వలపు స్పర్శతో
పులకించిన పుడమి
శ్రీ గంధపు పరిమళాలను వెలువరిస్తుంది
ఆ ప్రేమ ధారలను
అనురాగంతో ఆలింగనం చేసుకుంటుంది
ఆత్మలోన ఇముడ్చుకుంటుంది...
పులకించిన పుడమి
శ్రీ గంధపు పరిమళాలను వెలువరిస్తుంది
ఆ ప్రేమ ధారలను
అనురాగంతో ఆలింగనం చేసుకుంటుంది
ఆత్మలోన ఇముడ్చుకుంటుంది...
ఈ ప్రకృతీ పురుషుల
అనురాగ సంగమ వేళ
ప్రకృతీలో అణువు లాంటి నేనూ
అతని ప్రేమలో తడిచాను...
పరవశించాను...
అనురాగ సంగమ వేళ
ప్రకృతీలో అణువు లాంటి నేనూ
అతని ప్రేమలో తడిచాను...
పరవశించాను...
తడిపేసారు ... ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి"నాన్ను గాక నా మనసును తడిపే శక్తి
రిప్లయితొలగించండిఈ వాన నీటికి ఎక్కడిదీ...?" అని.
చాలాచాలా బాగుంది.బాగా రాసారండీ.
చాలాచాలా బావుంది!!
రిప్లయితొలగించండిచాలా బాగుందండి. అభినందనలు.
రిప్లయితొలగించండిఅసలెంత అద్భుతంగా ఉందో మీ వర్ణన !
రిప్లయితొలగించండి"ప్రకృతి విరహ గీతికిలకు
పురుషుడు నిలువెల్లా కరిగి
ప్రేమ చినికులై ప్రకృతి
తనువంతా తడిపేస్తాడు"
ఎంత అందమైన భావన !
అందరికీ ధన్యవాదాలండీ.. :)
రిప్లయితొలగించండిఆత్రేయగారూ నా బ్లాగులోకి స్వాగతం... సుస్వాగతం... :)
"నాన్ను గాక నా మనసును తడిపే శక్తి
రిప్లయితొలగించండిఈ వాన నీటికి ఎక్కడిదీ...?" అని.
చాలాచాలా బాగుంది.బాగా రాసారండీ.
Hats off to you
Above all others said it all. Good one.
రిప్లయితొలగించండినా బ్లాగుకొచ్చి ఈ లింక్ ఇచ్చి ఒక అందమైన కవితని చదివే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఏ మాటకామాటే చెప్పాలి. మీరు రాసింది చాలా చాలా నచ్చేసింది నాకు :)
నేను రాసినదానికి మీరిచ్చిన వివరణ కూడా సబబుగానే తోస్తోంది.
మీ బ్లాగులో నేను చదవాల్సిన పోస్టులు చాలానే ఉన్నట్టనిపిస్తోంది. మళ్ళీ వస్తాను :)
ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి