About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

16, జులై 2009, గురువారం

వేడుకోలు


కృష్ణా..!
నీ మురళీ గానంతో మాయ చేసి
మనసు గాయాలను సైతం మాన్ప గలవట..
నీ మోహన రాగానికి
ప్రకృతి మొత్తం పులకిస్తుందట..



అన్నీ తెలిసిన వాడిలా ఉండుటకన్నా
అమాయకుడిలా బ్రతకటం మేలని తెలియక...



ప్రతీదీ తెలుసుకోవాలని
తాపత్రయ పడ్డాను...



తీరా తెలిసిన కొద్దీ
అనుభవానికి వస్తున్న కొద్దీ
లోకం పోకడకు నా మనసు పగిలిన కొద్దీ
బాధతో నలిగి పోతున్నాను...



తెలియక చేసిన నేరమిది ప్రభూ..!
ఇక నాకేమీ తెలుసుకోవాలని లేదు
ఏ ప్రతిభా నిరూపించాలని లేదు...


ఈ స్వార్ధ ప్రపంచంలో కూడా
మంచిని మాత్రమే చూడగలిగే
ఆ అమాయకత్వమే నాకు కావాలి.



స్త్రీని దేవతగా పూజించ గలిగే
సాటి మనిషిని మనిషిగా ప్రేమించ గలిగే
చెడుని క్షమించి మంచిని మాత్రమే గుర్తించగలిగే
ఆ అమాయకత్వమే నాకు కావాలి.

అలా జరగాలంటే...
నా మనసును కమ్మిన
మేఘాలు తొలగిపోవాలి...

ఆ శక్తి నీకే ఉందని, నీవు మాత్రమే
నాలోని ప్రెమను వేయింతలు చేయగలవనీ...

తొలి వెలుగు కన్నా, చిరు జల్లు కన్నా...
నీ వేణు గానానికి ఉన్న శక్తి అమితమని నమ్మి...
నీ చరణాలపై వాలి వేడుకొంటున్నాను...

ఓ ప్రభూ..!

మా మనసులకు పట్టిన మాలిన్యాన్ని కడిగివేసి
నిత్య ఉత్సాహంతో.. ఆనందంతో...
జీవించ గలిగే శక్తిని ప్రసాదించు ప్రభూ..!

6 కామెంట్‌లు:

  1. బాగా రాశారు. నిజంగా భగవంతుడు ఈ ఆశ నెరవేరిస్తే జగత్తు సుందర నందనవనం అవుతుంది.
    బొమ్మ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. naa manasuki chaala daggaraga anipinchindi

    రిప్లయితొలగించండి
  3. ముగ్ధ మనోహరంగా నిద్రిస్తున్న వంశీ మోహనుడ్ని చూడగానే ఓక్షణం యశోదమ్మనైపోయానండీ ....
    జగాలేలే పరమాత్మ నిస్వార్ధంగా మీరు కోరిన కోరిక తీర్చడా ?

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగా రాసారండీ. అన్నీ తెలుసుకుంటున్న కొద్దీ, అమాయకత్వం లో వున్న ఒక్కొక్క ఆనందం కోల్పోతూ వుంటాము. కాని ఎప్పటికి చిన్న పిల్లలు గా వుండటం సాధ్యపడదు కాబట్టి మనసుకి నచ్చకపోయినా ఎదగక తప్పదు...

    మీ నిద్దరోతున్న చిట్టి కన్నయ్య బొమ్మ ఎంతసేపు చూసినా తనివి తీరటం లేదండి. అందుకే నేను copy చేసేస్కుంటున్నా...

    రిప్లయితొలగించండి