About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

28, జనవరి 2009, బుధవారం

ప్రేమలో ఓడిపోయారా..?


మీరు ఎవరినైనా మనసారా ప్రేమించారా..? ఆ వ్యక్తే శ్వాసగా జీవించారా..? వారి ప్రేమకై తపించారా..? ఆ ప్రేమను పొందడం కోసం దేనికైనా సిద్ధపడ్డారా..? కానీ ఆ వ్యక్తి మిమ్మల్నీ, మీ ప్రేమనూ తిరస్కరించారా..? అవమానించారా..? లేదా మోసగించారా..? కారణం ఏదైతేనేమి? " నాది ఫెయిల్యూర్ లవ్ స్టోరీ" అని వాపోతున్నారా..? అది తలచుకున్నప్పుడల్లా గుండెల్ని పిండేసినట్లు వుటుందా..? వీటన్నిటికీ మీసమాధానం `అవును' అయితే కనుక మీరే నాకు కావలసింది, మీకోసమే ఈ వ్యాసం. (మిగతావారూ చదవండి. నచ్చితే ఎవరినైనా చదవమని ప్రోత్సహించవచ్చు.)

"ప్రేమకు ఓటమి ఏమిటీ..?" అని చాలామంది మేధావులు ప్రశ్నిస్తుంటారు. అదంతా మనం పట్టించుకోవద్దు. ఎంత మర్చిపోదామనుకున్నా... ఉన్నట్టుండి ఒక బాధా కెరటం మీ మనసును తాకుతుంటుంది కదా.!? దాని శక్తికి తాళలేక మీరు విలవిలలడిపోతుంటారు... ఏమి చెయ్యాలో అర్ధం కాని దైన్యంలో కూరుకు పోతుంటారు... అయితే నన్ను నమ్మండి. ఒక్కసారి మీరు మర్చిపోవాలనుకుంటున్న ఆ గతాన్ని తవ్వి వెలికి తియ్యండి. దాన్ని కప్పి వుంచడానికి మీచుట్టూ మీరు సృస్టించుకున్న ఈ కృత్రిమ ఆనందం అనే దుమ్మును దులపి పారేయండి.

"మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం పొరపాటు కాదా..?" అంటూ మీ ఆలోచనల్ని పక్కదారి పట్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తుంటాయి, మోసపోకండి. ఆలోచించండి... గుండె లోతుల్లోకి వెళ్లండి... అప్పుడు.., ఆ వ్యక్తి మీ ప్రేమను తిరస్కరించిన క్షణం... ఒక్క నవ్వు.., ఒక్క చూపు.., ఒక్క మాట... ఏదో ఒకటి మీ హృదయంలో పిడిబాకులా గుచ్చుకుని అది పగిలిపోవడానికి కారణం అయ్యి వుండవచ్చు. వొకవేళ అదే కనుక జరగక పోతే... మీ ప్రేమ వరదలా పొంగివుండేది... నిజమైన ఆనందంలో జీవిస్తూ ఉండేవారు...

అదే ఆ క్షణాన్ని మళ్లీ, మళ్లీ గుర్తుకు తెచ్చుకోండి. ఆ నిమిషం మీ గుండెల్లో ఒక అగ్ని పర్వతం పేలి ఉంటుంది... భగ భగ మండి ఉంటుంది... ఆ విస్ఫోటనంలో మీలో ఆవేశం లావాలా పైకి తన్నుకు వచ్చి ఉంటుంది... అదే, సరిగ్గా అదే ఆవేశం నాకు కావలసింది. మీ మంచి తనం అనే ముసుగులో ఎందుకు దాన్ని దాచాలి అనుకుంటుంన్నారు. వద్దు... ఆ ఆవేశాన్ని చల్లార్చకండి. అఖండంగా వెలగనివ్వండి. ఆ వ్యక్తి కోరుకొని ఉంటే వారి కోసం మీరు ఏదైనా సాధించి ఉండేవారు. కానీ అలా జరగలేదే..? మరిచిపోవద్దు... మీ ప్రేమకు జరిగిన ఆ భంగపాటును మర్చిపోవద్దు. నలుగురి ముందూ ప్రేమను సాధించలేని, చేతకాని వారిగా మిమ్మల్ని నిలబెట్టిన ఆ వ్యక్తిని కలలో కూడా మర్చిపోవద్దు. "మీ ప్రేమలో ఇలా ఎందుకు జరిగింది?" అనే ప్రశ్న వద్దు మనకి. ఇప్పుడేమి చెయ్యలో అది మాత్రమే చెప్తున్నాను నేను. మీ ఆవేశాన్ని రగిలించమంటున్నాను. రగిలే ఆవేశంలో మీలోని శక్తులన్నీ మేల్కొంటాయి. అప్పుడు మీరు దేనినైనా దహించగల అగ్ని స్వరూపులవుతారు. ఆ శక్తులన్నిటినీ ఒక చోట కేంద్రీకరించండి. ఇప్పుడు సంకల్పిస్తే ఏదైనా మీరు సాదించగలరు. ఆ సంకల్ప బలాన్ని వృధా పోనివ్వకండి.

"సంకల్పించండి...

నా జీవితాన్ని నేను కోరుకున్నట్లుగా తీర్చి దిద్దుకుంటా నని...

నా కలల లోకం నిర్మిస్తానని...నన్ను నేను ప్రేమిస్తానని...

నా కర్తవ్యాన్ని గుర్తు చేసిన ఆ వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోనని..."

ఒక్క సారి సంకల్పించాకా.., ఆ దిశగా ప్రయత్నించాకా... పాల వంటి మీ మనసులో పడిన ఆ ద్వేషం(విషం) స్థానంలో ప్రేమ(అమృతం) నిండుతుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది.

ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెడతారో అప్పుడే మీ చుట్టూ ఉన్న వారినీ ప్రేమించడం మొదలవుతుంది. ప్రేమంటేనే విజయమని తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను ఆ క్షణంలోనే మీ జీవితాన్ని పాతెయ్యక... క్షణ క్షణం జీవించమని... మీ ఆవేశానికి అడ్డుగా వేసుకున్న ఆనకట్టల్ని త్రవ్వి పారెయ్యమని... అక్కడితో మీ ప్రేమ ఆగిపోకూడదు. ఎన్ని కొండలు ఎదురైనా దారి మళ్లించుకుని ప్రవహించే జీవ నది లాగ మీ ప్రేమ కూడా పొంగిపొర్లాలి. బీడు వారిన ఎన్నో హృదయాలలో అది ప్రేమ పూలను పూయించాలి.

-ప్రేమికుడు

19 కామెంట్‌లు:

  1. చివరివరకూ చదవకుండా అపార్ధం చేసుకున్నందుకు మన్నించాలి .భగ్న ప్రేమికుల్ని రెచ్చగొట్టే విధంగా రాస్తున్నారనిపించింది .పూర్తి చేశాక అర్ధమైంది ఎంత స్ఫూర్తి దాయకంగా ఉందో .అభినందనలు .

    రిప్లయితొలగించండి
  2. మీకు లానే బాధపడ్డవారితో బాధనుండి బయటకు వచ్చే మార్గాన్ని చూపించాలనుకున్నందుకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. మీకు లానే బాధపడ్డవారికి బాధనుండి బయటకు వచ్చే మార్గాన్ని చూపించాలనుకున్నందుకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. ఇదే మొదటిసారి మీ బ్లాగు చదవడం.
    చాలా బాగుంది మీ టపా..!

    రిప్లయితొలగించండి
  5. నేను కూడా సగం చదివి అపార్ధం చేసుకుని ఆవేశపడిపోయా.చివరి ఏమి చెపుతారో చూద్దామని చదివితే తెలిసింది.....మంచి టపా .

    రిప్లయితొలగించండి
  6. విశ్వ ప్రేమికులకు ప్రేమతో..!
    ప్రేమ గురించి.. పేజీలు .. రాస్తున్నారు.. బాగుంది. చాలా బాగుంది..
    అయితే.. నాదొక ప్రశ్న... ప్రేమంటేనే.. విజయమన్న మీరు.. ప్రేమలో ఓడిపోయారా ...? అని అడగడం.. ఆశ్చర్యం ...!
    Naa uddesam prakaaram prema oka.. brama.. odi poyananukovadam maro brama.. yendukante.. andulo kaavalanu kovadam.. korukunnadi dakkaka povadam.. వంటి విషయాలు .. మాత్రమే.. అన్ని చోట్లా .. చర్చకు తెస్తున్నారు.. కాబట్టి .. మనలో ఉన్నా శక్తి బయటకు తేవడానికి... వేరే ఏమి .. గుర్తుంచు కోవనవసరం లేదు మరిచి పోనవసరం లేదు.. (ప్రేమ యొక్క mగెలుపు ... ఓటముల గురించి..).. మనలని మనం మరచి పోయే స్థితి.. అయితే.. పాజిటివ్ నోట్ తో ముగిసినందుకు.. మీ ప్రయత్నాన్ని.. అభినందిస్తున్నాను.. శివ Cheruvu

    రిప్లయితొలగించండి
  7. Too good one!!! Small suggestion, please change the background color of the template, yellow is too bright for such wonderful posts. Jope you'll not mind this suggestion

    రిప్లయితొలగించండి
  8. నావ్యాసానికి స్పందించి, మీ విలువైన అభిప్రాయాలను అందించిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీరు ఇలాగే ప్రోత్సహిస్తుంటే మరిన్ని వ్యాసాలతో మీ ముందుకొస్తుంటాను.
    @శివ చెరువు గారు: మంచి ప్రశ్న వేశారు. మీ ప్రశ్న నానుండి మరొక వ్యాసాన్ని వెలికి తీసింది. అందుకు మీకు కృతజ్ఞతలు. ప్రేమలో గెలుపు, ఓటమి ఉండవనేది నేనూ ఒప్పుకుంటాను.
    మీ ప్రశ్నకు సమాధానం నా తరువాతి వ్యాసంలో దొరకవచ్చు.
    ఇకపోతే దేముడు ఉన్నాడనే వారున్నారు, లేడు అదంతా వట్టి భ్రమ అనే వాళ్లూ ఉన్నారు. అలాగే ప్రేమ విషయంలో కూడా భిన్న వాదాలు వున్నాయి. నేను ప్రేమ ఉంది అని గట్టిగానమ్ముతాను. అది కంటికి కనపడదు. మనసుతో చూడాలి.

    రిప్లయితొలగించండి
  9. @ శివ గారు:క్షమించండి. నేననుకున్న వ్యాసం రాయటం లేదు. అందుకే మీప్రశ్నకు సమాధానం ఇక్కడే చెప్పేస్తున్నాను.

    ఒక వ్యక్తిలోని లోపాలను సైతం మన్నించి ఆ వ్యక్తిని ప్రాణాధికంగా ప్రేమించడం అంటే మనం మన జీవితంలో సాధించిన గొప్ప విజయం అని నా అభిప్రాయం అయినా.., ప్రేమలో ఓడి పోయారా..? అంటూ ప్రారంభించాను. దాని వల్ల మామూలు వాళ్లు నా టపా చదివినా చదవక పోయినా, ప్రేమలో వ్యతిరేకత ఎదుర్కున్న వాళ్లు తప్పకుండా చదువుతారు కదా..? మిగతావారిని కూడా ఆకర్షించే విధంగానే ఉంది కదా..? అందుకే అలా మొదలు పెట్టాను. నేను ఎంతవరకూ కృతకృత్యుడనయ్యానో మీరే చెప్పాలి. :)
    @ లక్ష్మి గారు, మధుర వాణి గారు: మీ సూచనలకు ధన్య వాదాలు. :)

    రిప్లయితొలగించండి
  10. ఆకర్షించే విధంగా ఉంది ..బాగుంది.
    చాలా బాగుంది..మంచి టపా ..అభినందనలు .

    రిప్లయితొలగించండి
  11. ప్రేమికుడు గారు, బాగుంది మీ టపా..
    దూసుకెళ్లండి ప్రేమతొ, జాగ్రత్తగా..
    All the best!........

    రిప్లయితొలగించండి
  12. సార్ ప్రేమికుడుగారు నా పేరు కె . పుల్లారావు నేను ఒక బ్లాగర్ ను ఓపెన్ చేసాను మీలా నేను కూడా "కూడలి" సైట్ లో నా బ్లాగర్ ని చూచు కోవాలి అను కుంటున్నాను సార్ నా బ్లాగర్ ని కూడలికి ఎలా లింక్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇవరించగాలరని మిముల్ని అబ్యర్ధిస్తునాను ప్లీజ్ సార్ మీ ప్రేమికుడు ప్రొఫైల్ చదివాను చాల బాగుంది sir naa phone number: 9247889871 naa gmil ID pullaraoani2010@gmail.com naa blogger pearu pavankalyanI.A.S sir naaku help cheayagalarani aasistunaanu please sir

    రిప్లయితొలగించండి
  13. ప్రేమికుడు గారు,

    ప్రేమకు ఓటమి ఏమిటీ..?" అని చాలామంది మేధావులు ప్రశ్నిస్తుంటారు. అదంతా మనం పట్టించుకోవద్దు.
    మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం పొరపాటు కాదా..?" అంటూ మీ ఆలోచనల్ని పక్కదారి పట్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తుంటాయి, మోసపోకండి
    నా కలల లోకం నిర్మిస్తానని...నన్ను నేను ప్రేమిస్తానని...


    ఈ వ్యాఖ్యలు చాలా బాగున్నాయి ముఖ్యంగా "నన్ను నేను ప్రేమిస్తానని" అన్నది. ఈ ప్రపంచములో తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తిని మరెవ్వరూ ప్రేమించరు. ప్రేమించడం, అది ఫలించనప్పుడు బాధ పడడం సహజమే కానీ, ఆ గతాన్ని ఈ వర్తమానములో తలుచుకొంటు భవిశ్యత్తును నాశనము చేసుకోవడం తగని పని.

    రిప్లయితొలగించండి
  14. baaga chepparandi........blogto ila kontamandiki ayina help avutunnaru great.......(chetta discussions cheya kunda)

    రిప్లయితొలగించండి
  15. baga rasav annaiah Love gurinchi...
    elantivi inka rayi... bavunai...
    nenu easy gane chadava galiganu..


    @Raj : Its wonder to see you here!! Anyways Nice!!

    రిప్లయితొలగించండి