మీరు మీ బ్లాగులో వ్యాఖ్యలు రాయడానికి ఎవరినీ అనుమతించ కూడదు అనుకుంటున్నారా..?
అయితే మీ డాష్ బోర్డ్ నుండి సెట్టింగులుకి వెళ్లండి. అక్కడ వరుసగా ప్రాథమిక, రచురన ,ఆకృతీ కరణ, వ్యాఖ్యలు ... అని ఉంటాయి. ఆ వ్యాఖ్యలు అనే చోట నొక్కండి. మళ్లీ వ్యాఖ్యలు > చూపించు / దాచ్పెట్టు అని వస్తుంది. దాచిపెట్టును సెలెచ్ట్ చేసుకుని ఆ పేజి క్రిందకు వచ్చి సెట్టింగులు సేవ్ చెయ్యి నొక్కండి. అంతే మీ బ్లాగులో వ్యాఖ్యలు కనపడవు.
మీరు పోష్టులను సవరించులోకి వెళ్లి, మీరు వ్యాఖ్యలను తొలగించాలి అనుకుంటున్న టపా మీద నొక్కండి. అప్పుడు పోష్ట్ ఎడిటర్ వస్తుంది.
ఆ ఎడిటింగ్ బాక్స్ లో ఎడమచేతి వైపు క్రిందన పోష్ట్ ఎంపికలు అని ఉంటుంది. అది నొక్కితే- దానికి సరిగ్గా క్రిందన రీడర్ వ్యాఖ్యలు - అనుమతించు / అనుమతించ వద్దు అని ఉంటుంది. మీకు కావలసిన దానిని ఎంపిక చేసుకోండి.
తరువాత మళ్లీ ఓ సారి పోష్ట్ ఎంపికలు పై క్లిక్ చేయండి. తరువాత పోష్ట్ ను ప్రచురించండి. మీ బ్లాగులో చూసుకోండి. ఆ టపాకు వ్యాఖ్యలు రాయడానికి ఎవరికీ వీలు పడదు. మళ్లీ మీరు అనుమతించే వరకు.
పేజీలు
About me
- విశ్వ ప్రేమికుడు
- నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...
31, అక్టోబర్ 2009, శనివారం
29, అక్టోబర్ 2009, గురువారం
కొత్త బ్లాగరుల కోసం... మీ బ్లాగు వ్యాఖ్యలలో పదనిర్ధారణ తొలగిచడమెలా?
ఒక్కో చుక్కా కలిస్తేనే నది అవుతుంది. మీ చేతులు కలిస్తేనే ఇది సంపూర్ణమౌతుంది.
అనుకో కుండా అక్కడక్కడా కొత్త బ్లాగు మితృలకు ఇచ్చిన సలహాలను ఈ కొత్త బ్లాగరులకోసం లో ప్రచురిస్తున్నాను. నాకేదో చాలా తెలుసని కాదు. తెలిసినంత వరకు చెబితే కొత్త వారికి ఉపయోగిస్తుందని. ఈ విషయంలో మీకింకా ఏమైనా తెలిస్తే వ్యాఖ్యలలో రాయండి. అలాగే నేను అక్కడక్కడా వాడిన ఆంగ్ల పదాలకు తెలుగు అనువాదాలు తెలుపండి.అవి సవరిస్తాను.
మీ పోస్టులకు వ్యాఖ్య రాసినపుడు కొన్ని ఆంగ్ల అక్షరాలను నిర్ధారణ కోసం రాయమని అడుగుతుంది. దానినే పదనిర్ధారణ లేదా వర్డ్ వెరిఫికేషన్ అంటారు.
అది వ్యాఖ్యలు రాసే వారికి కాస్త విసుగొచ్చే విషయం. ఎందుకంటే తప్పుగా టైపు చేసినా, టైపు చెయ్యడనికి కాస్త ఎక్క్కువ టైం తీసుకున్నా మళ్లీ ఇంకో పద నిర్ధారణ అడుగుతుంది. దాని అవసరం అంత లేదని నా ఉద్దేశం.
ఒక వేళ అది మీరు తొలగించాలి అనుకుంటే మీ " డాష్ బోర్డు " కు వెళ్లి మీ బ్లాగు ---- సెట్టింగులు ---- నొక్కండి. అక్కడ మీకు వరుసగా ప్రాధమిక, ప్రచురణ, ఆకృతీ కరణ, వ్యాఖ్యలు....... మొదలైన ఆప్షన్స్ వస్తాయి.
అందులో " వ్యాఖ్యలు " అనే చోట నొక్కండి. అప్పుడు వ్యాఖ్యలకు సంబంధించిన సెట్టింగులు వస్తాయి. అందులో క్రిందినుండి 3 వ ఆప్షన్ " పదనిర్ధారణ చూపాలా వద్దా " అని అడుగుతుంది. మీరు " వద్దు " నొక్కండి. తరువాత క్రింద గానీ పైనగానీ ఉన్న " సెట్టింగులను సేవ్ " చెయ్యి నొక్కాలి. అంతే.... ఇక మీ బ్లాగును చూసుకోండి. వ్యాఖ్యలు రాసిన తరువాత పదనిర్ధారణ అడుగదు. :)
ఆడవాళ్లు చాలా మంది ఇతరులు రాసిన వ్యాఖ్యలను ముందుగా తాముచూసిన తరువాతే అవి ప్రచురిస్తారు. ఎందుకంటే కొంతమంది ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా రాసేవారూ ఉంటారు మన బ్లాగరులలో... కనుక అటువంటి సెట్టింగులు చేసుకుంటారు. మీరుకూడా అలా చేయాలంటే అదే పుటలో ( పేజీలో ) క్రిందినుండి 4 వ ఆప్షన్ చూడండి.
ధన్యవాదాలు :)

లేబుళ్లు:
కొత్త బ్లాగరుల కోసం...
కొత్త బ్లాగరుల కోసం... ఫ్రెండ్ కనెక్టర్ ను మీ బ్లాగుకు చేర్చటం ఎలా ?
ఒక్కో చుక్కా కలిస్తేనే నది అవుతుంది. మీ చేతులు కలిస్తేనే ఇది సంపూర్ణమౌతుంది.
అనుకో కుండా అక్కడక్కడా కొత్త బ్లాగు మితృలకు ఇచ్చిన సలహాలను ఈ కొత్త బ్లాగరులకోసం లో ప్రచురిస్తున్నాను. నాకేదో చాలా తెలుసని కాదు. తెలిసినంత వరకు చెబితే కొత్త వారికి ఉపయోగిస్తుందని. ఈ విషయంలో మీకింకా ఏమైనా తెలిస్తే వ్యాఖ్యలలో రాయండి. అలాగే నేను అక్కడక్కడా వాడిన ఆంగ్ల పదాలకు తెలుగు అనువాదాలు తెలుపండి.అవి సవరిస్తాను.
ఫ్రెండ్ కనెక్టర్ అంటే కొన్ని బ్లాగులలో ఈ బ్లాగుని అనుసరించండి ( ఫాలో అవ్వండి ) అని కనిపిస్తుంది కదా అదే.
అది మీరు ఏ ర్పాటు చేసుకోవడానికి మీ డాష్ బోర్డ్ లో నాఖాతా అనే లింక్ కుడిచేతి పై మూలలో ఉంటుంది. దాన్ని రైట్ క్లిక్ చేసి కొత్త విండో/టాబ్ లో తెరువండి.
ఆ పుటలో " గూగుల్ ఫ్రెండ్ కనెక్ట్ " అనే లింకు ఉంటుంది. దాన్ని నొక్కండి. తరువాత వచ్చిన పుటలో ( ఇక్కడ ఓ చిన్న విషయం. మీకు ఒకటి కన్నా ఎక్కువ బ్లాగులు ఉంటే..., ముందు ఎడమ చేతివైపు ఉన్న బ్లాగు పేర్లలో మీకు కావలసిన బ్లాగు పేరును నొక్కండి. ఆ తరువాత ) " యాడ్ ది మెంబర్స్ గాడ్జెక్ట్ " అనే లింకు నొక్కండి. తరువాతి పుటలో ౩ వ పేరాలో " జెనరేట్ కోడ్ " అనే బొత్తాన్ని నొక్కితే వచ్చే కోడ్ ని కాపీ చేయండి.
మళ్ళి మీ " డాష్ బోర్డ్ " కి వెళ్లండి. అక్కడ " లే అవుట్ " అనే లింక్ నొక్కండి.
అక్కడ " గాడ్జట్ ని చేర్చు " అనే బొత్తం నొక్కితే ఓ చిన్న విండో ఓపన్ అవుతుంది. అక్కడ " హెచ్ టి ఎమ్ ఎల్ / జావా స్క్రిప్ట్ " అన్న బొత్తం వద్ద " + "నొక్కండి.
శీర్షిక అన్న చోట మీకు నచ్చినది పెట్టవచ్చు. ( నేను నన్ను వీడని వారు అని పెట్టాను ) క్రింద ఖాళీగా ఉన్న పెద్ద పెట్టెలో ఇందాకా కాపీ చేసిన కోడ్ ని పేస్ట్ చెయ్యండి.
క్రింద సేవ్ చెయ్యి అనే బొత్తం నొక్కండి.
తరువాత మీ లే అవుట్లో మీరు పెట్టిన శీర్షిక ఉన్న గాడ్జట్ కనిపిస్తుంది. దాన్ని మీకు నచ్చినట్టు పైకీ, క్రిందికీ జరుపుకు్ని అదే పుటలో ఉండే " సేవ్ చెయ్యి " నొక్కండి. ఇప్పుడు మీ బ్లాగుకు వెళ్లి చూసుకోండి. అక్కడ మీరు పెట్టిన శీర్షికతో అనుసరించు అనే గాడ్జట్ కనపడుతుంది. :)

27, అక్టోబర్ 2009, మంగళవారం
ఒక్క కన్నీటి చుక్క...

ఒక్క కన్నీటి చుక్క...
తెలుపు సత్యాలు ఎన్నో ...!
ప్రేమ పొంగే మనసున్నదని
మానవత్వం మనకున్నదని
స్పందిస్తే యద పోంగునని
నదిగా అది మారునని
ఉబికే గంగై జాలువారినది
కురిసే చినుకై నేల రాలినది
ఒక్క కన్నీటి చుక్క...
తెలుపు సత్యాలు ఎన్నో ...!
ప్రేమ పొంగే మనసున్నదని
మానవత్వం మిగిలున్నదని...
బాధలోనూ నేనున్నానంటుంది
ఆనందమైనా అతిథిలా వస్తుంది
వెచ్చగా చెక్కిలిని ముద్దాడి
నన్నెపుడూ ఒంటరి కానీ నంటుంది
ఒక్క కన్నీటి చుక్క
తెలుపు సత్యాలెన్నో...!
అసలు ఎవరు తాను?
ఎచట దాగుంది ఇంతకాలమూ?
ఎందుకు నన్నిలా వేధిస్తుంది?
మౌనంగా నేనుందామనుకున్నా...
వేల మాటలకు ఒకే ఒక్క బదులు తానై
వెలికి వచ్చే వెర్రి ధార లాగా
ఒక్క కన్నీటి చుక్క...
తెలుపు సత్యాలు ఎన్నో ...!
ప్రేమ పొంగే మనసున్నదని
మానవత్వం మిగిలున్నదని...
అందునా అందం ఉన్నదని....
ఆనందం యద చిందుననీ....
18, అక్టోబర్ 2009, ఆదివారం
గతించిన వన్నీ పునరాగతమౌతున్నవి

అరుణుడు అస్తమించేది
వెన్నెల వెలుగును చూపడానికే.....
కడలి ఆవిరైనది తిరిగి
చిరుజల్లై కురవటానికే....
రాలే ఆకులు చెబుతున్నవి
వసంతమై మరలి వస్తామని....
పరుగిడు కాలం తెలుపుతున్నది
మరచిన మానవత్వాన్ని మరల ఆశ్రయిస్తావని....
ఇవి అన్నీ అస్తమయంతో ఆగిపోవు
నవ నవోన్మేషమై ఉదయించే వరకూ ఊరుకోవు ...
గతించిన వన్నీ పునరాగతమౌతున్నవి
పడిన చోటే ఆపకు నీపరుగు
లేచి నడిచావంటే ఉండరు నీసాటి ఇంకెవరూ
అని మరోమారు మనకు తెలుపుతున్నవి .
" తొలి అడుగు " బ్లాగు మిత్రుడు కార్తిక్ గారు రాసిన విశ్వ జనుడా మేలుకో అనే కవిత ద్వారా ప్రేరణ పొంది రాసినది ఈ కవిత.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)