About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

29, అక్టోబర్ 2009, గురువారం

కొత్త బ్లాగరుల కోసం... ఫ్రెండ్ కనెక్టర్ ను మీ బ్లాగుకు చేర్చటం ఎలా ?

ఒక్కో చుక్కా కలిస్తేనే నది అవుతుంది. మీ చేతులు కలిస్తేనే ఇది సంపూర్ణమౌతుంది.

అనుకో కుండా అక్కడక్కడా కొత్త బ్లాగు మితృలకు ఇచ్చిన సలహాలను ఈ కొత్త బ్లాగరులకోసం లో ప్రచురిస్తున్నాను. నాకేదో చాలా తెలుసని కాదు. తెలిసినంత వరకు చెబితే కొత్త వారికి ఉపయోగిస్తుందని. ఈ విషయంలో మీకింకా ఏమైనా తెలిస్తే వ్యాఖ్యలలో రాయండి. అలాగే నేను అక్కడక్కడా వాడిన ఆంగ్ల పదాలకు తెలుగు అనువాదాలు తెలుపండి.అవి సవరిస్తాను.

ఫ్రెండ్ కనెక్టర్ ను మీ బ్లాగుకు చేర్చటం ఎలా ?



ఫ్రెండ్ కనెక్టర్ అంటే కొన్ని బ్లాగులలో ఈ బ్లాగుని అనుసరించండి ( ఫాలో అవ్వండి ) అని కనిపిస్తుంది కదా అదే.

అది మీరు ఏ ర్పాటు చేసుకోవడానికి మీ డాష్ బోర్డ్ లో నాఖాతా అనే లింక్ కుడిచేతి పై మూలలో ఉంటుంది. దాన్ని రైట్ క్లిక్ చేసి కొత్త విండో/టాబ్ లో తెరువండి.

ఆ పుటలో " గూగుల్ ఫ్రెండ్ కనెక్ట్ " అనే లింకు ఉంటుంది. దాన్ని నొక్కండి. తరువాత వచ్చిన పుటలో ( ఇక్కడ ఓ చిన్న విషయం. మీకు ఒకటి కన్నా ఎక్కువ బ్లాగులు ఉంటే..., ముందు ఎడమ చేతివైపు ఉన్న బ్లాగు పేర్లలో మీకు కావలసిన బ్లాగు పేరును నొక్కండి. ఆ తరువాత ) " యాడ్ ది మెంబర్స్ గాడ్జెక్ట్ " అనే లింకు నొక్కండి. తరువాతి పుటలో ౩ వ పేరాలో " జెనరేట్ కోడ్ " అనే బొత్తాన్ని నొక్కితే వచ్చే కోడ్ ని కాపీ చేయండి.

మళ్ళి మీ " డాష్ బోర్డ్ " కి వెళ్లండి. అక్కడ " లే అవుట్ " అనే లింక్ నొక్కండి.

అక్కడ " గాడ్జట్ ని చేర్చు " అనే బొత్తం నొక్కితే ఓ చిన్న విండో ఓపన్ అవుతుంది. అక్కడ " హెచ్ టి ఎమ్ ఎల్ / జావా స్క్రిప్ట్ " అన్న బొత్తం వద్ద " + "నొక్కండి.

శీర్షిక అన్న చోట మీకు నచ్చినది పెట్టవచ్చు. ( నేను నన్ను వీడని వారు అని పెట్టాను ) క్రింద ఖాళీగా ఉన్న పెద్ద పెట్టెలో ఇందాకా కాపీ చేసిన కోడ్ ని పేస్ట్ చెయ్యండి.

క్రింద సేవ్ చెయ్యి అనే బొత్తం నొక్కండి.

తరువాత మీ లే అవుట్లో మీరు పెట్టిన శీర్షిక ఉన్న గాడ్జట్ కనిపిస్తుంది. దాన్ని మీకు నచ్చినట్టు పైకీ, క్రిందికీ జరుపుకు్ని అదే పుటలో ఉండే " సేవ్ చెయ్యి " నొక్కండి. ఇప్పుడు మీ బ్లాగుకు వెళ్లి చూసుకోండి. అక్కడ మీరు పెట్టిన శీర్షికతో అనుసరించు అనే గాడ్జట్ కనపడుతుంది. :)

5 కామెంట్‌లు:

  1. ‘ఫ్రెండ్ కనెక్టర్’ టపా నాకు ఉపయోగపడింది. ఈ సమాచారం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్!

    రిప్లయితొలగించండి
  2. మీరు అనుచరించెవారా ?మిమ్మల్ని అనుచరించేవారా?

    రిప్లయితొలగించండి
  3. మన బ్లాగులో మనల్ని వేరొకరు అనుసరించడనికి, అంటే మన (బ్లాగు) తో స్నేహం చెయ్యడానికి ఈ ఫ్రెండ్ కనెక్టర్ ఉపయోగ పడుతుంది. నను అనుసరించే వారన్నమాట :)

    రిప్లయితొలగించండి
  4. ముందుగా మీకు ధన్యవాదాలు. అలాగే విశ్వప్రేమికుడు గారి సందేహమే నాదీను. గాడ్జెట్ నయితే ఏడ్ చేసేసానులెండి మీ సూచనలతో.

    రిప్లయితొలగించండి
  5. నా బ్లాగ్లో ఫాలోయర్స్ గాడ్జెట్ మీరుచెప్పినట్లు పెడితే వచ్చింది ఇది వరకు చాలా త్రై చేసేను. .చాలా థాంక్స్.కానీ స్మైలీలే రావటంలేదు కొంచెం చెప్పండి.

    రిప్లయితొలగించండి