About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

27, అక్టోబర్ 2009, మంగళవారం

ఒక్క కన్నీటి చుక్క...


ఒక్క కన్నీటి చుక్క...
తెలుపు సత్యాలు ఎన్నో ...!

ప్రేమ పొంగే మనసున్నదని
మానవత్వం మనకున్నదని

స్పందిస్తే యద పోంగునని
నదిగా అది మారునని

ఉబికే గంగై జాలువారినది
కురిసే చినుకై నేల రాలినది

ఒక్క కన్నీటి చుక్క...
తెలుపు సత్యాలు ఎన్నో ...!

ప్రేమ పొంగే మనసున్నదని
మానవత్వం మిగిలున్నదని...

బాధలోనూ నేనున్నానంటుంది
ఆనందమైనా అతిథిలా వస్తుంది

వెచ్చగా చెక్కిలిని ముద్దాడి
నన్నెపుడూ ఒంటరి కానీ నంటుంది

ఒక్క కన్నీటి చుక్క
తెలుపు సత్యాలెన్నో...!

అసలు ఎవరు తాను?
ఎచట దాగుంది ఇంతకాలమూ?
ఎందుకు నన్నిలా వేధిస్తుంది?

మౌనంగా నేనుందామనుకున్నా...
వేల మాటలకు ఒకే ఒక్క బదులు తానై
వెలికి వచ్చే వెర్రి ధార లాగా

ఒక్క కన్నీటి చుక్క...
తెలుపు సత్యాలు ఎన్నో ...!

ప్రేమ పొంగే మనసున్నదని
మానవత్వం మిగిలున్నదని...

అందునా అందం ఉన్నదని....
ఆనందం యద చిందుననీ....

15 కామెంట్‌లు:

  1. హ్మ్మ్ కన్నిటి చుక్క విలువ బాగా తెలియ చెప్పేరు..

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగారాసారండి....మనసుకి హత్తుకుంది!

    రిప్లయితొలగించండి
  3. హలో విశ్వప్రేమికుడు మిత్రమా చాలా బాగుంది.....
    నిజం చెప్పమంటావా ఏదో చెప్పాలని పూర్తిగా చెప్పకుండానే ఆగిపోయినట్టులేదు !
    దీన్ని ఇంకా పొడిగించి,కొన్ని ఉదాహరణలతో వివరించి రాసేందుకు ప్రయత్నించు ఇంకా బాగుంటుంది.....
    సలహా ఇస్తున్నానని మరోలా అనుకోకూడదు నాకైతే ఇలాంటి భావుకత ఉట్టిపడేలా రాయడం రాదు....
    మీరన్న ఇంకా బాగా రాయాలని.......

    రిప్లయితొలగించండి
  4. అందరికీ ధన్యవాదాలు.
    కార్తీక్ : అరే సరిగ్గా నా మనసులోని మాట చెప్పారు. నేను కవితనైతే ప్రచురించాను గానీ నాకు సంతృప్తి కలుగలేదు. నేను ఇంకొంత ఆలోచించి రాద్దామనుకుంటూ ఉన్నాను. ఇంతలో మీరూ చెప్పారు. ధన్యవదములు మిత్రమా... :)



    " సలహా ఇస్తున్నానని మరోలా అనుకోకూడదు నాకైతే ఇలాంటి భావుకత ఉట్టిపడేలా రాయడం రాదు....
    మీరన్న ఇంకా బాగా రాయాలని....... "

    ఇలాకూడా అనాలనిపిస్తుందా మీకపుడపుడూ.. హా... అంత అవసరమా అని అడుగుతున్నాను... :):)

    రిప్లయితొలగించండి
  5. ఒక్క కన్నీటి చుక్క...వస్తూ మనసును భారం చేస్తుంది
    వెళుతూ సేదతీరుస్తుంది ...బావుందండీ మీ కవిత !

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగా రాసారు.
    మీ అన్ని కవితలు, కధలు చాలా బాగునాయ్యి.
    మీరు పేర్కునట్లు కధలు చాలా సరదాగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  7. మనసువిప్పి చెప్పుకునేది కన్నీటిచుక్కతోనే విశ్వప్రేమికుడుగారు. ఎప్పుడూ తోడుండేది కూడా కన్నీటి చుక్కే. ఏనాటికి విలువ తరగనిది ఈ కన్నీటిచుక్కకే..

    రిప్లయితొలగించండి
  8. మనసువిప్పి చెప్పుకునేది కన్నీటిచుక్కతోనే .... ఎప్పుడూ తోడుండేది కూడా కన్నీటి చుక్కే. ఏనాటికి విలువ తరగనిది ఈ కన్నీటిచుక్కకే..చాలా బాగారాసారండి....మనసుకి హత్తుకుంది

    రిప్లయితొలగించండి
  9. మనసువిప్పి చెప్పుకునేది కన్నీటిచుక్కతోనే విశ్వప్రేమికుడుగారు. ఎప్పుడూ తోడుండేది కూడా కన్నీటి చుక్కే. ఏనాటికి విలువ తరగనిది ఈ కన్నీటిచుక్కకే..చాలా బాగారాసారండి....మనసుకి హత్తుకుంది................

    రిప్లయితొలగించండి
  10. చాలా బావుందండి. నిజంగా ఎంత విలువైనది..

    రిప్లయితొలగించండి