About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

31, జులై 2009, శుక్రవారం

ప్రణవం...


ప్రణయంలా సృష్టిని చేసినా...
ప్రళయమై లయం చేసినా...
అన్నింటా ఒకటే ఉన్నది


కదిలే మబ్బులు... కదలని కొండలు....
కురిసే చినుకులు... కులికే నడకలు...
వీచే గాలులు... విరిసే నగవులు...
అన్నిటా ఒకటే ఉన్నది

మాటలలో తేలదు
చూపులకు చిక్కదు
ఆత్మలోన ఇమిడినది
అందరూ పొందలేనిది

అందుకే...

నాలో నేనే జ్వలిస్తుంటాను...
ద్వేషపు విషాన్ని హరించాలని

నలుగురిలో నన్నే దర్శిస్తుంటాను...
ప్రేమను పంచాలని

మౌనంగా ఏకాంతాన్నే వరిస్తుంటాను...
చలించని చిత్తాన్ని చేబూనాలని

మనసుని పదే పదే మధిస్తుంటాను...
ఆనందామృతం వెలువరించాలని

ప్రణయంలా సృష్టిని చేసినా...
ప్రళయమై లయం చేసినా...
అన్నింటా ఒకటే ఉన్నది
ప్రణవమే కదా మూలమైనది.

10 కామెంట్‌లు:

  1. అన్నిటికీ అదే ఆది..అది అందుకునే మీ ప్రయత్నం ... అభినందనీయం.... Wish YOU All the Best Siva :)

    రిప్లయితొలగించండి
  2. @ శివ గారు: ధన్యవాదాలు
    @ మాధవ్ గారు: ఏదో అంతా మీ అభిమానం
    @ నేస్తం గారు & సాహితి గారు : ధన్యవాదాలండి. :)

    రిప్లయితొలగించండి
  3. ఈ ప్రణవమే జీవితానికి మూలాధారం.

    రిప్లయితొలగించండి
  4. ఉషగారు: అవును.అందుకే అన్నాను

    "ప్రణయంలా సృష్టిని చేసినా...
    ప్రళయమై లయం చేసినా...
    అన్నింటా ఒకటే ఉన్నది
    ప్రణవమే కదా మూలమైనది."

    అని...

    హనూ గారు: ధన్యవాదాలు

    మలా కుమార్ గారు: మీపేరు చూసి మొగవారనుకున్నాను. కానీ మీ ప్రొఫైల్ చూశాకా అర్ధమైంది, అందులో సగం మీవారిదని. మీ సాహితీ బ్లాగు బాగుంది. త్వరలో కామెంటేస్తాను.

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. super andi విశ్వ ప్రేమికుడు ...

    neanu koodaa mee laanTi vaari spoorthi toane oka blaagu start chesaanu...
    meeantha baagaaa rayalenilenDi

    oka saari choosi emina thappuluntecoment cheyyagalaru ...
    meelaanti vaari soochanalu naaku chaalaa avasaramanDi..
    naa blog..
    www.tholiadugu.blogspot.com

    రిప్లయితొలగించండి