About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

6, మార్చి 2009, శుక్రవారం

నాకేం తెలుసు? ఫెమినిజానికి ఈ నిజం నచ్చదని...

పట్టు పావడలో, పారాణి రాసిన,
పసిడి పట్టీల పాదాలను ముద్దాడాలనుకున్నాను.
ముంగిట ముగ్గులేస్తుంటే
కబుర్లతో కవ్విద్దామనుకున్నాను.
తను వంట చేస్తుంటే
వెనుకగా వెళ్లి కౌగలించాలనుకున్నాను.
వడ్డించి తినిపిస్తుంటే ఆమె ఒళ్లో పడుకుని
ముద్ద ముద్దకో ముద్దును లంచంగా తీసుకోవాలనుకున్నాను.
నేను రాళ్ళు మోసినా, రాజునైనా ఆమెను మాత్రం
నా ఇంటికి రాణిని చెయ్యాలనుకున్నాను.

నాకేం తెలుసు? ఫెమినిజానికి
ఈ నిజం నచ్చదని...
వారి స్వేచ్చను నేను హరిస్తున్నానని...
మగవాడికి ఇలాంటి కోరికలు ఉండరాదని....

ఎందుకంటే ఏమని చెప్పను?
ఇలాంటి కోరికలతోటే మొగవారు
ఆడవారిని వంటింటి కుందేళ్లను చేస్తున్నారట..
వారికి స్వేచ్చ కావాలట..
ఇంటి చాకిరీ నుండి విముక్తి కావాలట..
పైకి ఎంతో అందంగా కనిపించే ఇలాంటి
కోరికల వెనక పెద్ద వంచన ఉందట..!

నాకేం తెలుసు? ఫెమినిజానికి
ఈ నిజం నచ్చదని...
దీని వెనుక ఇంత పెద్ధ కథ ఉందనీ..!


స్త్రీని గౌరవించే, పూజించే నాలో
ఇంత వంచకుడున్నాడా..!
అని ఆలోచనలో పడ్డాను.

నేను అలా ఎందుకు కోరానంటే..
కారణమేమని చెప్పను?
"అమ్మను చూశాను గనుక"
అలాంటి అమ్మాయినే భార్యగా కలగన్నానని...
ఎంత లేవని బుకాయించినా మగవాళ్ల
అంతరాంతరాలలో ఉండేది ఇలాంటి కోరికలేననీ...
ఎలా చెప్పను? చెప్పినా మన్నించేదెవరు?
ఏది ఏమైనా వారి మనసు నొప్పించే పని చేయలెను. వారికీ స్వేచ్చ ఇవాలనీ గుర్తించాను. నేనే కాదు స్త్రీని ప్రేమించే చాలా మంది అలాంటి కలలకు స్వస్తి చెప్పారు, చెప్తున్నారు. కానీ నాకొక్కటే అనుమానం.. వారుకోరుకున్న స్వేచ్చ వారికి లభించిందా..? అని. డబ్బు సంపాదనలో వారు బంధీలవుతున్నారేమో అని.

16 కామెంట్‌లు:

  1. నాకేం తెలుసు? ఫెమినిజానికి
    ఈ నిజం నచ్చదని...

    నాకు తెలిసి.. నిజం వున్న . . .ఈ నిజం.. అందరికీ అందుతుంది..

    రిప్లయితొలగించండి
  2. అవును నిజం. మగ నిజాలన్నీ ఫెమినిజానికి పడని నిజాలే. :)

    రిప్లయితొలగించండి
  3. "వారుకోరుకున్న స్వేచ్చ వారికి లభించిందా..? అని. డబ్బు సంపాదనలో వారు బంధీలవుతున్నారేమో అని"
    ఇది ఒక జవాబు దొరకని ప్రశ్న.

    రిప్లయితొలగించండి
  4. చాల బాగుందండి ,ఆలోచించేట్లు ఉంది ,ముఖ్యంగా చివరి లైన్స్ ,..

    రిప్లయితొలగించండి
  5. ఇంత సహజమైన ,సున్నితమైన కోరికను కూడా బయటకు చెప్పలేని మగవారికి మాత్రం స్వేచ్ఛ ఎక్కడుంది .అలాగే ఎగిరే చిలుకను తెచ్చి బంగారు పంజరంలో పెట్టినా అది బందిఖానాయే అవుతుంది .స్వేచ్ఛ అనేది వారి వారి భావాలను బట్టి ఉంటుంది .మీరన్నట్టు ఆర్ధిక స్వేచ్ఛను కోరుకునేవారూ ఉన్నారు .ఆర్ధిక స్వేచ్చవలన వ్యక్తిగత స్వేచ్ఛ పెరుగుతుంది .సక్రమంగా ఉపయోగించుకోలేకపోతే ఆ స్వేచ్చే మనిషినీ ,మానవతా విలువల్నీ దిగజార్చేస్తుంది .విలువలు స్త్రీ పురుషులిద్దరికీ ఉండాలి .అప్పుడే స్వేచ్ఛకు అందం , దంపతులకు ఆనందం . బావుందండీ మీ పోస్ట్ .

    రిప్లయితొలగించండి
  6. మీరు రాసింది ఏమి బాలేదు.
    అయినా అది మీ అభిప్రాయం-ఇది నా అభిప్రాయం,
    ఇక్కడ అందరూ స్వేచ్చజీవులే!

    రిప్లయితొలగించండి
  7. మీరు రాసింది ఏమి బాలేదు.
    అయినా అది మీ అభిప్రాయం-ఇది నా అభిప్రాయం,
    ఇక్కడ అందరూ స్వేచ్చ జీవులే!

    రిప్లయితొలగించండి
  8. Dhanyavaadamulu!
    abinandanalu!
    naku yemi artham kaaledu! :-)

    రిప్లయితొలగించండి
  9. mee abhiprayam bagundi..... mee kalalu,korikalu kuda chala bagunnayi... meeru rasaru kada ma ammani chusanu alane na bharyani chudalankuntunnanu ani,thats good... but meeku lane adavariki kuda konni abhiprayalu,konni asalu untayi. aa vishayanni magavaru entha varaku ardam chesukuntaranedey prasnardhakam???? anyway nice....

    రిప్లయితొలగించండి
  10. korikalu anachukovadam, korikalu lekunda jeevinchadam anedi kaadu ikkada, korukunna jeevithanni ivvaleka (jevinchaleka) povadame asalu samasya, anduke feminisaniki ee nijam nachaledu ani meeku anipinchi undachu...

    రిప్లయితొలగించండి
  11. ప్రేమికుడుగారు మీరు సున్నితమైన విషయాల జోలికి వెల్లకుండ ఉంటే బాగుంటుంది. ఈ మధ్య బ్లాగు లోకంలో సున్నితమైన వాటినే భూతద్దంలో వ్యక్తపరుచుకుంటున్నారు. ఇది అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆలొచించంది, తర్వాత మీ ఇష్టం. మిరు రాసిన విదానం బాగుంది. :)

    రిప్లయితొలగించండి
  12. కోరికలు ఒకొక్కరికి ఒకోలా కనిపిస్తాయి.
    మీరు చెప్పాలి అనుకున్నది ఇంకా సూటిగా చెప్పి వుంటే బాగుండేది.

    రిప్లయితొలగించండి
  13. మీ విలువైన అభిప్రాయాలు తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలండీ...
    @ శేషు గారు: మీ సూచనకు కృతజ్ఞతలు. ప్రయత్నిస్తాను.
    @ హరి ప్రియ గారు : మీ రన్నట్టు నా భావంలో స్పష్టత లోపించిందండీ... అది ప్రచురించిన కాసేపటికి నాకు అర్ధమయ్యింది. మరో సారి అలా కాకుండా చూసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  14. "maa"taranikee eetaraniki undandi chala teda..:)

    రిప్లయితొలగించండి
  15. ఎంత అందగా, ఎంత బాగా చెప్పారండీ...ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా జంకుతున్న ఈ కాలంలో మీరు నిర్భయంగా చెప్పారు....very nice!

    రిప్లయితొలగించండి