About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

23, జనవరి 2009, శుక్రవారం

అందమైన కల్పన...


నేను చిన్న పిల్లడిగా ఉన్నా. ఎవరో చిన్న అమ్మాయి వచ్చి "ఆడుకుందామా?" అని అడిగింది. ఎవరు నువ్వు అని అడిగాను. కిలకిలా నవ్వింది. సరే ఆడుకుందాం రా..! అని నది వొడ్డుకు తీసుకు వెళ్లాను. అక్కడ ఇసుకతో కోటలు కట్టాను. అవన్నీ ఆమె చెయ్యి తగిలి నిజమైన కోటలు అయిపోయాయి. ఆమె ప్రక్కనే ఉన్న కొండ దారి చూపింది. ఇద్దరం ఆడుకుంటూ ఆ కొండ ఎక్కుతున్నాము. పైకి చేరేటప్పటికి ఇద్దరం యవ్వన వంతులం అయ్యాం.
ఆమె నా కళ్లు మూసి తెరిచింది.
అరే...! ఆశ్చర్యం..!
మా చుట్టూ ఉన్న ప్రకృతి ఎంతో అందంగా ఉంది. నేను మునుపెన్నడూ చూడలేదు అంత అందాన్ని. చెట్లు మాతో మాట్లాడుతున్నాయి. గాలి రాగాలు పలుకుతోంది. మనసు ఆనందంతో తేలిపోతోంది. ఆమె నాకు క్రొత్త అందాల్ని చూపించింది. మరోసారి అడిగాను ఎవరు నువ్వని. ఆమె మళ్లీ కలహంసలా నవ్వింది. "నేనా..! నీ కావ్య కన్యకను" అంది. (అహా..! ఎంత అందం. ఈ ప్రకృతిలో నుండి ఈమె పుట్టిందా..? లేక ఈమెలోనుండే ఈ ప్రకృతి పుట్టిందా..?) ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావు? అని అడిగాను. "నీలోనే... నీతోనే..." అంటూ నన్ను గట్టిగా హత్తుకుంది. వొక్క క్షణం గాలి స్థభించింది. మరు క్షణం మనసు తేలికైంది. ఆకాశం నుండి మంచులా అమృతం కురిసింది. నా హౄదయం కరిగి నదిలా ప్రవహించింది. నాకు అమరత్వం లభించింది. ఆమె మరల నాలో ప్రవేశించి మాయమైంది. ఇప్పుడు నేను కంటితో చూడడం మానేశాను. మనసే కన్నుగా చేసుకుని ప్రకౄతిలోని అణువణువునా ఆమెని చూస్తున్నాను. ప్రేమిస్తున్నాను.
ఇది నా అందమైన కల్పన.

6 కామెంట్‌లు:

  1. adbhutamga vundi mee kalpana anta kante amoogamuga vundi mee varnana. Telugu veluguni nalu dikkula prasarimpa cheyali meeru ani manspoorthy ga aakanshishtoo...

    itlu
    Nayani Aditya Madhav

    రిప్లయితొలగించండి
  2. చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
    నమ్మటానికి ఎంతో బావుందీ ..............
    మనసుకు రెక్కలోస్తే ..............
    ఇంకా బావుంది .

    రిప్లయితొలగించండి
  3. బాగుందండి... మీ ఊహా.. మీ పద జాలం.. మీతో ఏముందో.. మీలో ఏముందో .. మీరు.. గుర్తించినట్టున్నారు ... ఇది సుభ పరిణామమే...

    రిప్లయితొలగించండి
  4. అందమైన కల్పన అద్భుతం గా వుంది.మీ శైలి కూడా.

    రిప్లయితొలగించండి
  5. ధన్యవాదాలండీ.
    పరిమళం గారికీ, శివ గారికీ, లక్ష్మి గారికీ, రాధిక గారికీ నాబ్లాగులోకి స్వాగతం... సుస్వాగతం. :)

    రిప్లయితొలగించండి