About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

22, జనవరి 2009, గురువారం

ప్రేమికుడు

నమస్కారం. నాకు తెలుగన్నా, తెలుగు కధలన్నా మహా ఇష్టం. అంతర్జాలంలో తెలుగు వారి కృషి చూసి ఆనందపడిపోయాను. ఇంతటి మహా యజ్ఞంలో నేను సైతం అని మీ చేతిలో చెయ్యి కలపాలనిపించింది. ఎంతో ఉత్సాహంగా బ్లాగు తయారు చేశాను. కానీ ఏమి రాయాలో అర్ధం కాలేదు. ఏది రాసినా సగంలో చెరిపేసేవాడిని. ఏదీ వోపట్టాన నచ్చలేదు. చివరికి ఆ ప్రయత్నం మానుకుందాము అనుకున్న సమయంలో ప్రేమ మీద రాస్తే ఎలా వుంటుందీ అనే ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా నచ్చింది కూడా. దాని కార్య రూపమే ఈ ప్రేమికుడి అవతారం. నా వ్యక్తిత్వానికి వో పేరు పెడితే ప్రేమికుడు అనేది సరి అయిన పదం. అవును నేను ప్రేమికుడిని. అలా అని అమ్మాయిల చుట్టూ తిరిగే ప్రేమికుడిని కాదు. అందరి మంచీ కోరే "విశ్వ ప్రేమికుడిని".

అమ్మమ్మ దగ్గర నుండి అమ్మాయిల దాకా వివిధ వ్యక్తుల్నీ, పరిస్థితుల్నీ; కష్టాన్నీ, సుఖాన్నీ; తప్పునీ, వొప్పునీ; ప్రతి విషయాన్నీ అర్ధం చేసుకొంటూ, అవగాహనకొస్తూ, ఆస్వాదిస్తూ, ప్రేమిస్తూ నాకు తెలిసిన ప్రతి విషయాన్నీ మీతో పంచుకుంటాను. :-)
వాలు కన్నుల వయ్యారి చూపులే కాదు నా మదిని తాకేది...
అయ్యా ధర్మం అనే అవ్వ ఆక్రోశమూ...
అర్ధ రాతిరేళ రహదారి వెంట వెళుతుంటే వర్షమల్లె కురిసే మంచులో వణుకుతూ పడుకున్న పసి పాపలూ...
పది డాబాల మధ్య నిలకడ లేని డేరాల డేరైన కాపురాలూ...
పసి పాపల బోసి నవ్వులూ...
సంధ్యా దేవి అందాలూ... ప్రకృతి పరువాలూ...
ఇలా ఎన్నో... ఎన్నెన్నో... నన్ను చలింప చేస్తాయీ...
ప్రేమతో ఆలోచింప చేస్తాయి...

ఇలా కాస్త కుర్రతనం, కాస్త మంచితనం కలగలిపిన కబుర్లతో మీ ముందుకొస్తున్నాను. ఆసీర్వదిస్తారు కదూ...

ప్రేమికుడు :-)

4 కామెంట్‌లు:

  1. Prematho viswa premikuniki Subhakankshalu..
    mee gurinchina vivaramulu bahu chakkaga ponduparicharu, akarshinchela vundi blog peru kaakapote "prati prashnaku premee samadhanam kaadu ala ani prema samadhaname kadu" ani nenu anatledu. idi naa abhiprayam ante.Mee blog marinta ga aakatukuntundani aakankshistoo..


    Itlu
    Nayani Aditya Madhav

    రిప్లయితొలగించండి
  2. మొట్ట మొదటగా విచ్చెసిన మాధవ్ గారికి నాబ్లాగులోకి స్వాగతం... సుస్వాగతం. :)

    రిప్లయితొలగించండి