నిజమే భలే ప్రశ్న. మనసుని ఎందుకు అదుపులో ఉంచాలి? ఉంచకపొతే ఏమవుతుంది? ఎటువంటి వాటి విషయంలో మనసుని అదుపు చెయాలి? కొంత మందికి సిగరెట్టు నుండి బయట పడాలనుకుంటారు. మరికొంత మంది మరీ అతిగా టీ కాఫీలకు కూడా స్వస్తి చెప్పాలనుకుంటారు. ఇక్కడ మంచి,చెడు ఏమైనా ఉన్నాయా? ఏ అలవాటైనా మనసుపడితే దాన్ని నిగ్రహించుకోవలసిందేనా? సిగరెట్టు, మందు, జూదం లాంటి వి శరీరాన్ని ధనాన్ని గుల్ల చేసే దుర్వ్యసనాలు అంటే నిగ్రహించు కోవాలి సరే. మరి చదవడం, పాడడం, ఆటలు ఆడడం, రచనలు చేయడం లాంటి మంచి అలవాట్ల నుండి మనసును ఎందుకు ఆపాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తక మానవు.

ఒక విషయం తప్పా ఒప్పా అన్నది ఆ విషయాన్ని ఆలోచించే వ్యక్తిని బట్టి,అతను ఉన్న పరిస్థితిని బట్టి ఉంటుంది. అది వదిలేద్దాం. ముందు మనసుని ఎందుకు నిగ్రహించాలి? ఇది మొదటి ప్రశ్న. దానిని అనుసరించి వచ్చింది ఎప్పుడు ( ఎటువంటి వాటి విషయంలో ) నిగ్రహించాలి? అనే రెండవ ప్రశ్న.
ఓ 25 ఏళ్ల వ్యక్తి ఉన్నాడనుకుందాం.
అతనికి అనుకోకుండా స్నేహితుల బలవంతం వల్లో, పరిస్థితుల ప్రభావమో మందు తాగడం అలవాటయింది అనుకుందాం.
అనుకున్నాం. ఏమయింది?
ఏమవుతుంది?కొంపలు మునిగి పొతాయ్! అసలే అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఇతనికి తాగుడు అలవాటుందని తెలిస్తే ఏ పిల్లైనా ముందుకు వస్తుందా? ఈ మధ్య ఆడపిల్లలు చాలా ఫాష్టు. ఆ అంతేగదా అని ఏ అమ్మయి అయినా ఒప్పేసుకున్నా ఒప్పుకోవచ్చు. కానీ ఆ అబ్బాయి తల్లి తండ్రులు ఎంత తల్లడిల్లి పోతారు? సరే అది పక్కన పెడదాం.
అతడు అసలు మనసుని ఎప్పుడూ నిగ్రహించుకుని ఎరగని వాడనుకోండి. ఎంత కష్టమో తెలుసా !? ఆ వ్యసనం రోజు రోజుకీ ఎక్కువయి పోతుంది. తాగి రోడ్డుమీద పడి దొర్లే స్థితిలో కొస్తుంది. ఎందుకంటే అతనికి నిగ్రహించుకోవడం తెలియదుకనుక. ఆ అవసరం లేదని అతని నమ్మకం కనుక.
ఆహా హా హా అలా ఎలా కుదురుతుంది? రోజుకు రెండు పెగ్గులే తాగి ఇంటికి వస్తాడు అని అంటారా?
అంటే అతను ఎంతో కొంత మనసుని అదుపులో పెట్టుకుని ఉన్నట్టే కదా? :)
కనుక మనం మనకు తెలియకుండానే కొంత వరకు మనసుని నిగ్రహిస్తున్నాం. కానీ అన్ని విషయాలలో కాదు. అదికూడా మనం ప్రయత్న పూర్వకంగా అనుకుని చేసే పనిలో కాదు. హమ్మయ్య ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. మన మనసు ఎప్పుడొ ఒకప్పుడు మన మాట వింటోంది. అయితే మరి మనం కావాలనుకున్నప్పడు చేయాలనుకున్న పని చేయగలిగే శక్తి మనకెలా వస్తుంది? అదే చిక్కు ప్రశ్న.
మిగతాది తరువతి టపాలో....
మరి మీరు కూడా ఏమైనా సలహా చెప్పి పుణ్యం కట్టుకోండీ! :)






