( గమనిక : నా కవితలే కాదు సదరు బ్లాగులో వేరే వారి కవితలు కూడా కాపీ కొట్టడమైనది. నాకు సరిగ్గా తెలియదు అవి ఎవరివో... కానీ నేను ఎక్కడో చదివాను ఆ కవితలు . ఓ సారి మీ కవితలేమైనా కాపీ కొట్ట బడ్డాయేమో చూసుకోండి .మొత్తానికి నా కవితలైతే ఉన్నవి ఉన్నట్టుగా కాపీ, పేస్టు చేశాడు ఆ బ్లాగర్. )
ఏమిటీ మీ కవితను కాపీ కొట్టారా...?
కాపీ కొట్టారా..? ఏమిటండీ...?
కొట్టడమూ... పబ్లిగ్గా జల్లెడలో పెట్టడమూ.... దానికి నేను కామెంట్ వెయ్యడమూ కూడా జరిగాయి. ఆసందర్భంగానే ఈ నా ఆనందం. ఇంతకీ నా కాపీ కొట్టబడిన కవిత పేరు కూడా ఆనందమే నండోయ్.
నా కవితని కాపీ కొట్టారంటే మనకీ, మన కవితకీ ఓ లెవెల్ ఉందన్న మాటే కదా...? ఏ మంటారు? ఇంతకీ మీరు నా కవిత చదివారా? చదవక పోతే...
నా బ్లాగులో నా కవిత చదవడానికి ఇక్కడ నొక్కండి.
మరి సదరు మై డ్రీమ్స్ (నా కలలు) బ్లాగులో నా కవితను అతని కలగా చదవడానికి ఇక్కడ నొక్కండి.
పనిలో పని మీ కవితలూ, కథలూ వగైరా కూడా ఏమైనా కాపీ లెవల్ కి ఎదిగాఎమో కూడా ఓ లుక్కేసుకోండి.
ఇప్పుడే చూసుకున్నా నా మరో కవిత " నా కోరికలు " కూడా కాపీ కొట్ట బడిందోచ్.... :-) ఎంత క్రేజు నా కవితలంటే ఆ ( నా డ్రీమ్స్ ) బ్లాగర్ కీ...? :)
అందులో ఉన్న మిగత కవితలుకూడా ఖచ్చితంగా అతనివి కాదండోయ్.....
ఇంకెందుకాలస్యం ఓ చుపెయ్యండి ... :)
